దేశవ్యాప్తంగా రోజూ ఏదొక మూల ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మంచంలో ఉన్న పండు ముసలమ్మ నుంచి ఉయ్యాల్లో ఉండే పసిపాప అని కూడా చూడకుండా అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. పోలీసులు ఎంత హెచ్చరించినా.. న్యాయస్థానాలు ఎంత కఠిన శిక్షలు విధించినా చాలామంది తీరులో మార్పు రావడంలేదు. తప్పు చేస్తే.. శిక్ష పడుతుందని తెలిసినా తప్పు చేయడానికి వెనుకాడటం లేదు. ఈ సంఘటన చూశాక చాలామందిలో తప్పు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి అత్యాచారానికి తెగబడ్డ ఓ మృగాడిని మహిళ కొట్టి చంపింది.
ఈ ఘటన రాజేంద్ర నగర్ పరిధి బద్వేల్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బాలయ్య- జయమ్మ దంపతులు బద్వేల్ లో నివాసముంటున్నారు. తెల్లవారుజామున ఫుల్ గా మద్యం తాగి.. శ్రీనివాస్ అనే వ్యక్తి జయమ్మ వాళ్ల ఇంటి తలుపు కొట్టాడు. తలుపులు తీయగా.. ఇంట్లోకి ప్రవేశించాడు. మద్యం మత్తులో శ్రీనివాస్ రెచ్చిపోయాడు. జయమ్మపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. జయమ్మ భయపడి పోకుండా శ్రీనివాస్ పై తిరగబడింది. పక్కనే ఉన్న ఇనుప రాడ్ తో అతని తలపై కొట్టింది. శ్రీనివాస్ అక్కడే కుప్పుకూలడు. అతనిపై రాడ్డులో జయమ్మ కొడుతూనే ఉంది. ఈ దాడిలో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. భర్తతో కలిసి జయమ్మ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది.
అత్యాచారం చేయడానికి వచ్చిన వ్యక్తిని కొట్టి చంపిన మహిళ
రంగారెడ్డి – బద్వేల్లో తెల్లవారుజామున తప్పతాగి తన ఇంటి తలుపులు కొట్టిన శ్రీనివాస్ అనే వ్యక్తి. తలుపులు తెరవగానే ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా జయమ్మ అనే మహిళపై అఘాయిత్యానికి యత్నించిన శ్రీనివాస్.
తాగిన మైకంలో రెచ్చిపోయిన… pic.twitter.com/UlNBaP1mX1
— Telugu Scribe (@TeluguScribe) June 23, 2023