Hands OFF Programe In Restuarant: తినడానికి కూడా బద్దంకంగా ఉందా? ఈ రెస్టారెంట్లో సర్వర్లే తినిపిస్తారు!

తినడానికి కూడా బద్దంకంగా ఉందా? ఈ రెస్టారెంట్లో సర్వర్లే తినిపిస్తారు!

Hands Off Program- Restuarent: తినడానికి కూడా బద్దకంగా ఉన్న చాలామంది బదకిస్టులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ రెస్టారెంట్లో మీరు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడమే కాకుండా.. మీకు తినిపిస్తారు కూడా.

Hands Off Program- Restuarent: తినడానికి కూడా బద్దకంగా ఉన్న చాలామంది బదకిస్టులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ రెస్టారెంట్లో మీరు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడమే కాకుండా.. మీకు తినిపిస్తారు కూడా.

తెలుగు సినిమా లవర్స్ అంతా కచ్చితంగా మల్లీశ్వరి సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో ఆహుతి ప్రసాద్ క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే తన పక్కనే ఉన్న వస్తువులను కూడా తాను తీసుకోకుండా బ్రహ్మానందంతో తెప్పించుకుంటూ ఉంటాడు. ఒక సినిమాలో అయితే ఆఖరికి కాలు మీద కాలు కూడా వేరే వాళ్లని వేయమని అడుగుతాడు. అలాంటి సీన్స్ చూసినప్పుడు చాలా మంది నవ్వుకుంటారు. కానీ, రియాలిటీలో కూడా అలాంటి వాళ్లు ఉంటారంటే నమ్ముతారా? ఎందుకు ఉండరు భేషుగ్గా ఉంటారు. అలాంటి వారికి ఒక్కోసారి తినడం కూడా కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. అలా అనిపిస్తే మాత్రం ఈ రెస్టారెంట్ కి వెళ్లిపోండి.

కాస్త వినడానికి విడ్డూరంగా ఉన్నా కూడా. అలా తినడాన్ని కూడా ఒక పని చూసేవాళ్లు, తినడానికి నానా కష్టాలు పడేవాళ్లు చాలా మందే ఉంటారు. అలాంటి వారికోసమే ఈ రెస్టారెంట్ తీసుకొచ్చారు. ఇందులో మీ చేతులతో పనిలేదు. ఎంచక్కా మీరు ఆర్డర్ ఇచ్చేసి సీట్లో కూర్చుంటే.. వాళ్లే చక్కగా మీకు కావాల్సిన ఆహారాన్ని నోటికి అందిస్తారు. లండన్ లోని మార్లేబోన్ అనే సిటీలో ఈ వింత హోటల్ ఉంది. బ్లాండ్ఫర్ స్ట్రీట్ నెంబర్ 71లో ఉండే రెస్టారెంట్ కథ ఇది.

టేస్ట్ కార్డ్, ఫెంగ్ సుషీ అనే రెండు రెస్టార్టెంట్లు కలిసి ఈ వినూత్న ఆలోచన చేశాయి. దీనికి హ్యాండ్స్ ఆఫ్ అనే పేరును పెట్టారు. దీనిని త్వరలోనే ప్రారంభించనున్నారు. అయితే వీళ్లు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ మీరు ఆర్డర్ ఇచ్చిన ఆహార పదార్థాలను తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేసి చేతులు దులుపుకోరండోయ్. ఎంచక్కా మీ నోటికి అందిస్తారు. జూన్ 11 నుంచి 14 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నాలుగు రోజుల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ ప్రక్రియను పరీక్షిస్తారు. వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ని బట్టి ప్రొసీడ్ అవుతారు. ఎక్కువ మంది కస్టమర్లు ఆ సర్వీస్ కు ఆనందం వ్యక్తం చేస్తే మాత్రం.. హ్యాండ్స్ ఆఫ్ కార్యక్రమం పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుంది.

అయితే ఈ కార్యక్రమం వెనుక ఇంకో ముఖ్య ఉద్దేశం కూడా ఉంది. అదేంటంటే.. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బుతో పేద చిన్నారులకు ఆహారాన్ని అందిస్తారు. ఈ రెస్టారెంట్లో మీరు ఫుడ్ తినాలి అంటే రూ.10(రూ.1761) పౌండ్లు కట్టాలి. ఏదో చారిటీ అంటున్నారు. నామమాత్రంగా ఆహారం ఉంటుంది అని భ్రమపడకండి. ఇందులో వరల్డ్ ఫేమస్ డిషెస్ అన్నీ ఉంటాయి. మీరు ఏది ఆర్డర్ ఇస్తే దానిని తీసుకొచ్చి వడ్డించడమే కాకుండా.. తినిపిస్తారు కూడా. మరి.. ఈ సర్వీస్ హైదరాబాద్ లో వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments