iDreamPost
android-app
ios-app

వీడియో: ఇంత హెవీ డ్రైవర్ ని ఎక్కడా చూసుండరు.. ఏకంగా ఏడుగురు పిల్లలతో!

వీడియో: ఇంత హెవీ డ్రైవర్ ని ఎక్కడా చూసుండరు.. ఏకంగా ఏడుగురు పిల్లలతో!

దేశవ్యాప్తంగా ట్రాఫిక్ విషయంలో పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రమాదంలో ఒక ప్రాణం పోతే.. ఒక కుటుంబం రోడ్డున పడినట్లే. ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కూడా కొందరు మాత్రం వారి పంథా మాత్రం మార్చుకోవడం లేదు. వారు నిర్లక్ష్యంగా వ్వహరించడం మాత్రమే కాకుండా.. ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పెడుతున్నారు. అలాంటి ఒక వ్యక్తి చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక స్కూటీ మీద ఏకంగా ఏడుగురు పిల్లలను ఎక్కించుకుని వెళ్తూ కనిపించాడు.

సాధారణంగా ప్రాంతం ఏదైనా.. ట్రాఫిక్ పోలీసులు ఎంతో కఠినంగా వ్యవహరిస్తున్నారు. రూల్స్ బ్రేక్ చేసిన వారికి చలానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల ఎంతమంది ప్రాణాలు నిలబెట్టిన వారు అవుతారో అర్థమయ్యేలా చెబుతున్నారు. కానీ, కొందరు మాత్రం అదే పనిగా రూల్స్ బ్రేక్ చేసే పనిలో పడ్డారు. ఇప్పుడు చెప్పుకోబోయే పెద్ద మనిషి చేసిన పనికి.. ఏకంగా ట్రాఫిక్ పోలీసులే నోరెళ్లెబెట్టారు. ఈ ఘటన ముంబయిలో జరిగింది.

ఒక వ్యక్తి స్కూటీ మీద ఏకంగా ఏడుగురు చిన్నారులను ఎక్కించుకుని కనిపించాడు. ఆ దృశ్యాలను అటుగా వెళ్తున్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో ముంబయి పోలీసులు స్పందించారు. ఇలాంటి చర్యను అస్సలు సహించేది లేదంటూ వ్యాఖ్యానించారు. సదరు వ్యక్తిని వెతికి పట్టుకుని అతనిపై కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడమే కాకుండా.. అంతమంది చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇలాంటి ప్రయాణాలను తాము ప్రోత్సహించమని.. కఠినంగా శిక్షిస్తామంటూ హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సదరు వ్యక్తికి నెటిజన్స్ కూడా గడ్డి పెడుతున్నారు. జరగరానిది జరిగితే ఆ పిల్లల ప్రాణాలు ఏమౌతాయంటూ ప్రశ్నిస్తున్నారు. అలాంటి పిచ్చి పనులు మానుకోవాలంటూ సూచిస్తున్నారు. ఇకనైనా తన బుద్ధి మార్చుకుని జాగ్రత్తగా ఉండాలంటూ హితవు పలుకుతున్నారు.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomgrandpashabetgrandpashabetganobet