iDreamPost
android-app
ios-app

విషాదం: చెల్లెలి మృతదేహాన్ని భుజాన వేసుకుని 5 కి.మీ నడక! ఎక్కడంటే?

Uttar Pradesh: ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొన్ని వీడియోలు చూస్తుంటే ఎంతో ఎమోషనల్, కన్నీరు పెట్టించే విధంగా ఉంటున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Uttar Pradesh: ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొన్ని వీడియోలు చూస్తుంటే ఎంతో ఎమోషనల్, కన్నీరు పెట్టించే విధంగా ఉంటున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

విషాదం: చెల్లెలి మృతదేహాన్ని భుజాన వేసుకుని 5 కి.మీ నడక! ఎక్కడంటే?

దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుంది. ఇదే విషయాన్ని ప్రతి రాజకీయ నేత తన ప్రసంగాల్లో ప్రస్తావిస్తుంటారు.కానీ ఇప్పటికీ కొన్ని గిరిజన ప్రాంతాల్లో సరైన రోడ్లు లేక ప్రజలు నానా అవస్తలు పడుతుంటారు. ఎలాంటి పనులకైనా కిలో మీటర్ల మేర కాలి నడకన నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంది.తమకు రోడ్డు వసతి కల్పించాలని కొన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు, గిరిజనులు ఏళ్ల తరబడి అడుగుతున్నా ఫలితం శూన్యం. ఎన్నికల సమయంలో హడావుడి చేసి తర్వాత కనుమరుగైపోతుంటారు నేతలు అని గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. సరైన రోడ్డు లేక.. వాహనాలు వచ్చే అవకాశం లేక చనిపోయిన తన సోదరి మృతదేహం 5 కిలోమీటర్లు మోశాడు. ఈ హృదయవిదారకరమైన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో గుండెల్ని పిండే ఓ సంఘట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాలియా అనే గ్రామంలో శివాని అనే బాలిక ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. రెండు రోజుల క్రితం శివాని టైఫాడ్ భారిన పడింది. ఆమె సోదరులు స్థానిక వైద్యుడికి చూపించగా మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా పాలియాలో రోడ్లు కొట్టుకుపోయాయి. శారదా నది ఉప్పొంది పొర్లుతుంది. వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆస్పత్రికి తరలించేందుకు శివానిని తన భుజంపై వేసుకొని పెద్దాసుపత్రికి తరలించేందుకు బయలుదేరారు. కానీ మార్గమద్యలోనే శివాని చనిపోయింది.

ఇద్దరు సోదరులు భుజాలపై మోస్తూ 5 కిలో మీటర్లు నడిచి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. తమ సోదరి మృతి చెందిడంతో ఓ పడవ సాయంతో మృతదేహాన్ని నది దాటించామని.. అక్కడ నుంచి వాహనాల సదుపాయం లేకపోవడంతో భుజాలపై మోస్తూ ఇంటికి తీసుకువచ్చామని కన్నీరు పెట్టుకున్నారు. రైలు పట్టాల పక్క నుంచి వస్తున్న వారిని ఓ వ్యక్తి గమనించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయాలు చలించిపోతున్నాయి. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి