iDreamPost
android-app
ios-app

ఈ కష్టం ఏ వరుడికి రాకూడదు.. గడ్డం కోసం పెళ్లి ఆపేశారు..!

ఈ కష్టం ఏ వరుడికి రాకూడదు.. గడ్డం కోసం పెళ్లి ఆపేశారు..!

సాధారణంగా ఒక పెళ్లి చేయాలి అంటే ఎంతో శ్రమ, ఖర్చుతో కూడుకున్న విషయం. పెళ్లిచూపుల నుంచి పెళ్లి జరిగే వరకు ఎన్నో ఇబ్బందులు, ఒడిదొడుకులు ఉంటాయి. ఒక్కోసారి చిన్న కారణం వల్ల కూడా పీటల వరకు వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు చూసే ఉంటారు. అయితే పెళ్లి ఆగిపోవడం అంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉండాలి. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే కారణం విన్నాక ఇలాంటి వాటికి కూడా పెళ్లి ఆపేస్తారా? అనే అనుమానం కలగకమానదు. మరి.. ఆ అన్ లక్కీ వరుడు ఎవరు? అసలు ఏం జరిగింది? మీరూ తెలుసుకోండి.

ఈ ఘటన కోయంబత్తూరు పరిధి సూలూరులో జరిగింది. ఒక వ్యాపారవేత్త కుమారుడికి మూడు నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. సోమవారం పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కోసం గత మూడు నెలలుగా రెండు కుటుంబాలు ఘనంగా ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాయి. ఈ మధ్యలో వరుడు- వధువు ఫోన్లో మాట్లాడుకోవడం, తరచూ కలుస్తూ ఉండటం కూడా చేశాడు. ఇన్ని రోజులు వధువుకి పెళ్లికొడుకు గడ్డంతోనే కనిపించాడు. కానీ, పెళ్లికి మాత్రం క్లీన్ షేవ్ చేయించుకుని రెడీ అయ్యేందుకు బ్యూటీపార్లర్ కి వెళ్లాడు. కానీ, గడ్డాన్ని కేవలం ట్రిమ్ మాత్రమే చేయించుకుని వచ్చాడు. అది చూసిన తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. గడ్డం ఎందుకు క్లీన్ షేవ్ చేసుకోలేదని నిలదీశాడు. అందుకు వరుడు సమాధానం చెప్పకుండా నీళ్లు నములుతూ ఉండటంతో తండ్రికి మరింత కోపం వచ్చింది.

కాసేపటి తర్వాత కుమారుడు అసలు విషయం చెప్పాడు. తాను క్లీన్ షేవ్ చేయించుకునేందుకే సిద్ధమ పడ్డానని.. కానీ, వధువు కోరడంతో అలా చేశాను అని ఉన్న మాట చెప్పాడు. దాంతో తండ్రి కోపం మరింత పెరిగింది. వెళ్లి క్లీన్ షేవ్ చేయించుకోమని ఆదేశించాడు. కానీ, వరుడు మాత్రం తనకు కాబోయే వ్యక్తి ట్రిమ్ చేసిన గడ్డంతో పెళ్లి పీటల మీద కూర్చోవాలి అని వధువు కోరిక అంటూ చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, అది అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. ఇప్పటి నుంచే నా మటా లెక్కచేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నావుగా అంటూ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా పెళ్లి జరగాల్సిన రోజు ఉదయం వరుడి తండ్రి తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈరోజు జరగాల్సిన నా కుమారుడి వివాహం జరగడం లేదు.. ఎవరూ రావాల్సిన అవసరం లేదంటూ పోస్ట్ చేశాడు.

ఈ విషయం కాస్తా పెళ్లి కుమార్తె కుటుంబానికి తెలియడంతో వాళ్లు పరుగున పెళ్లి కుమారుడి ఇంటికి వెళ్లారు. వరుడి తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తండ్రి మాత్రం తాను తీసుకున్న నిర్ణయంలో మార్పు ఉండదని తేల్చేశారు. అంతేకాదు.. జరగాల్సిన ఆ పెళ్లి కూడా జరగలేదు. ఈ విషం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కంపెనీలో కార్మికులు గడ్డం పెంచితేనే తాను అంగీకరించనని.. అలాంటి సొంత కొడుకే తన నియమాన్ని పెడచెవిన పెట్టడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆ తండ్రి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ గడ్డం పెళ్లి గురించే వైరల్ అవుతోంది. అందరూ ఆ పెళ్లికొడుకు మీద జాలి చూపిస్తున్నారు. కాబోయే భార్య మాట వినాలా? కన్నతండ్రి మాట వినాలో తెలియకి జీవితాన్ని అంధకారంలో పడేసుకున్నాడని కామెంట్ చేస్తున్నారు.