Tirupathi Rao
Daniel temporarily blinded: అందం కోసం, అందం పెరగడం కోసం ఎవరైనా బ్యూటీ పార్లర్ కి వెళ్తారు. అలాగే ఒక యువతి ఒక బ్యూటీషియన్ ని కలిసింది. ఆమె చేసిన పనికి ఈ అమ్మడుకి కళ్లు పోయినంత పనైంది.
Daniel temporarily blinded: అందం కోసం, అందం పెరగడం కోసం ఎవరైనా బ్యూటీ పార్లర్ కి వెళ్తారు. అలాగే ఒక యువతి ఒక బ్యూటీషియన్ ని కలిసింది. ఆమె చేసిన పనికి ఈ అమ్మడుకి కళ్లు పోయినంత పనైంది.
Tirupathi Rao
ఆడవాళ్లకు అందంగా కనిపించడం అంటే ఇష్టం. ఎంత అందంగా ఉన్నా మరింత అందంగా కనిపించేందుకు సలూన్స్ కి, బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. ఇప్పుడు అందం మారుస్తాం అంటూ మార్కెట్ లోకి చాలానే ట్రీట్మెంట్లు, విధానాలు వచ్చాయి. వాటిని అమ్మాయిలు కూడా తెగ ఫాలో అయిపోతున్నారు. గతంలో అంటే ఫేషియల్స్, మేకప్ అనేవాళ్లు. కానీ, ఇప్పుడు పర్మినెంట్ ఐబ్రోస్, పర్మినెంట్ లిపి స్టిక్, లిప్ పిల్లర్స్ అంటూ చాలా కొత్త ట్రీట్మెంట్లు వచ్చాయి. అయితే ఒక అమ్మాయి కూడా అందంగా కనిపించాలని బ్యూటీ పార్లర్ కు వెళ్లింది. అయితే ఆమె అందం పెరగడం ఏమో గానీ.. ఉన్న చూపు పోయినంత పనైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది.
మిర్రర్ నివేదిక ప్రకారం.. ఈ ఘటన యూకేలో జరిగింది. డానియల్ హబ్బర్డ్ మాల్టాలో ఉంటుంది. ఆమె తన ఐబ్రోస్ కి ఒక ట్రీట్మెంట్ ని బుక్ చేసుకుంది. దాని విలువ 12 పౌండ్లు ఉంటుంది. అంటే మన కరెన్సీలో రూ.1237 ఉంటుంది. అదేంటంటే.. ఐబ్రోస్ కి కలర్ వేయడం. అయితే ఆ బ్యూటీషన్ స్కిన్ టెస్ట్ చేయకుండానే తనకు ట్రీట్మెంట్ చేసినట్లు డానియల్ ఆరోపించింది. తనకు నేరుగా ఐబ్రోస్ కి కలర్ చేసినట్లు వెల్లడించింది. అయితే వేసినప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు కూడా తన ముఖం బాగానే ఉందని చెప్పింది.
తెల్లవారి లేచి చూసేసరికి తన ఎడమ కన్ను మొత్తం వాచిపోయిందని.. తనకు చూడటానికి కూడా అవ్వలేదని చెప్పింది. డానియల్ హబ్బర్ ఎడమ కన్ను పూర్తి క్లోజ్ అయిపోయిన చిత్రాలను కూడా విడుదల చేసింది. తన కనుబొమ్మల చుట్టూ తెల్లగా పొట్టు లేచినట్లు అయ్యింది. కళ్లు ఉబ్బిపోయాయి. రాయల్ బ్లాక్ బర్న్ అనే ఆస్పత్రిలో తాను చికిత్స తీసుకుంటున్న విషయాన్ని వెల్లడించింది. ఆ రంగు డానియల్ స్కిన్ కు సెట్ కాలేదని వైద్యులు తేల్చారు. అలాగే అలర్జీని తగ్గించేందుకు డానియల్ కు స్టెరాయిడ్స్ అందజేశారు. ప్రస్తుతం డానియల్ కోలుకుంటోందని తెలుస్తోంది.
ఈ విషయాన్ని బ్యూటీషియన్ కి చెప్పగా ఆమె సరిగ్గా స్పందించలేదని చెప్తున్నారు. కనీసం ఆమె తన తప్పుకు పశ్చాతాపం కూడా వ్యక్తం చేయకపోవడం డానియల్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదంట. ఇక ఆ బ్యూటీషియన్ పై డానియల్ హబ్బర్ న్యాయ పోరాటానికి సిద్ధమైనట్లు తెలిపింది. తాను తన లాయర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. కచ్చితంగా ఆ బ్యూటీషన్ పై చర్యలు తీసుకునేలా తన పోరాటం ఉంటుందని డానియల్ స్పష్టం చేసింది. మొత్తానికి అందం కోసం పార్లర్ కి వెళ్లే.. కళ్లు పోయినంత పని చేశారని తెలుసుకుని సోషల్ మీడియాలో ఉండే అమ్మాయిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయితే చస్తే అలాంటి పార్లర్ కి వెళ్లమంటున్నారు. అలాంటి ట్రీట్మెంట్ చేయించుకునే సమయంలో స్కిన్ టెస్ట్ మస్ట్ కొందరు సూచిస్తున్నారు.