iDreamPost
android-app
ios-app

Fact Check: రోడ్డుపై వజ్రాలు.. ఎగబడి ఏరుకున్న జనాలు!

Fact Check: రోడ్డుపై వజ్రాలు.. ఎగబడి ఏరుకున్న జనాలు!

గుజరాత్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై వజ్రాలు పడిపోయాయని తెలియడంతో స్థానిక జనాలే కాక, ఇతర ప్రాంతాల నుంచి సైతం వచ్చి ఎగబడి ఏరుకున్నారు. ఇదంతా నిజమే అనుకుని దారిన పోయేవారు కూడా పనులు మానుకుని వజ్రాల వేటలో పడ్డారు. తీరా వజ్రాలు దొరికాక జువెల్లరీ షాపు యజమాని వారికి ఊహించని షాక్ ఇచ్చాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియలో కాస్త వైరల్ గా మారింది. అసలు ఆ వజ్రాలు ఎక్కడివి? జువెల్లరీ షాపు యజమాని ఇచ్చిన షాక్ ఏంటంటే?

మీడియా కథనం ప్రకారం.. గుజరాత్ సూరత్ లోని వరచ్చకు చెందిన ఓ వ్యాపారి స్థానికంగా వజ్రాల ప్యాకెట్ పోగొట్టుకున్నాడని ప్రచారంతో ఓ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక జనాలు అంతా అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆ రోడ్డుపై ఉన్న దుమ్ము, దూలిని అస్సలు లెక్క చేయకుండా అంతా వెతికారు. దీంతో కొందరికి కొన్ని వజ్రాలు దొరికాయి. వెంటనే వాళ్లు స్థానికంగా ఉన్న జువెల్లరీ షాపు యజమాని దగ్గరకు వెళ్లి అతనికి చూపించగా.. ఇవి నకిలీ వజ్రాలు అని చెప్పడంతో నోర్లు తెరవడం వారి వంతైంది. ఈ దెబ్బతో అంతా అక్కడి నుంచి నిరాశతో వెనుదిరిగారు. అయితే స్థానికులు అంతా ఎగబడి వజ్రాలు ఏరుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఘటనపై స్పందించిన మరికొందరు మాత్రం.. ఇది ఎవరో కావాలనే చేసి ఉండొచ్చని అభిప్రాయ పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి