iDreamPost

WhatsApp: ఆ ఫోన్లలో నిలిచిపోనున్న వాట్సాప్ సేవలు.. పూర్తి లిస్ట్ ఇదే!

WhatsApp: ఆ ఫోన్లలో నిలిచిపోనున్న వాట్సాప్ సేవలు.. పూర్తి లిస్ట్ ఇదే!

స్మార్ట్ ఫోన్లు వాడే వారికి వాట్సాప్ గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. మెసేజ్ లు, వీడియో కాల్, ఆడియో కాల్, ఫొటోలు, వీడియో షేర్ చేసుకునేందుకు ఈ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ ని వాడుతుంటారు. వరల్డ్ వైడ్ గా ఈ వాట్సాప్ కు చాలా మంది ఆదరణ ఉంది. కోట్లలో యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఆ యూజర్ల వ్యక్తిగత సమాచారం, గోప్యత వాట్సాప్ బాధ్యతే అవుతుంది. అందుకే మెటా కంపెనీ ఎప్పటికప్పుడు అప్ డేట్లు తీసుకొస్తూ ఉంటుంది. కొత్త కొత్త వర్షన్స్ తో కొత్త ఫీచర్లు తీసుకురావడమే కాకుండా.. భద్రత పరంగా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఉంటారు.

సాధారణంగా వాట్సాప్ సంస్థ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకురావడం మాత్రమే కాదు.. కొన్ని పాత డివైజ్ లలో సేవలను నిలిపివేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా కొన్ని మొబైల్స్ లో వాట్సాప్ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఆ మోడల్ ఫోన్లకు వాట్సాప్ తమ సపోర్ట్ ని నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఆండ్రాయిడ్ వర్షన్ 4.1, అంతకన్నా తక్కువ వర్షన్ ఉన్న డివైజ్ లలో అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ తమ సేవలను నిలిపిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియనే చెప్పుకొచ్చింది. అన్ని టెక్నాలజీ కంపెనీలు ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నట్లు తెలిపింది.

ముఖ్యంగా పాత వర్షన్ వోఎస్, చాలా తక్కువ మంది వాడే డివైజ్ లకు సంబంధించి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఆ మోడల్స్ వాడుతుంటే వారిని మోడల్ అప్ గ్రేడ్ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. లేనిపక్షంలో ఆ డివైజ్ లకు వాట్సాప్ సేవలు నిలిచిపోతాయి. ఒకవేళ పాత ఫోన్ అయినా కూడా.. అందులో 5.0 వర్షన్ ఓఎస్ ఉంటే వాట్సాప్ పనిచేస్తుంది. కాయ్ ఓఎస్ 2.5.0 వర్షన్ తో నడిచే జియో ఫోన్లలో కూడా వాట్సాప్ సేవలు కొనసాగుతాయి. ఐఫోన్ 12లో కూడా వాట్సాప్ సేవలు యథావిధిగానే కొనసాగుతాయి. అయితే ఈ లిస్టులో ఉన్న ఫోన్లను దాదాపుగా యూజర్లు వాడటం మానేశారు. అయితే ఒకవేళ ఎవరన్నా వాడుతున్నా కూడా.. వాళ్లకి వాట్సాప్ కావాలి అంటే మోడల్ మార్చుకోవాల్సిందే.

ఫోన్ల లిస్ట్ ఇదే:

నెక్సస్ 7, శాంసంగ్ గెలాక్సీ నెక్సస్, శాంసంగ్ గెలాక్సీ నోట్ 2, శాంసంగ్ గెలాక్సీ ఎస్2, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ 10.1, హెచ్ టీసీ వన్, హెచ్ టీసీ సెన్సేషన్, హెచ్ టీసీ డిజైర్ హెచ్ డీ, ఎల్జీ ఆప్టిమస్ జీ ప్రో, ఎల్జీ ఆప్టిమస్ 2 ఎక్స్, సోనీ ఎక్స్ పీరియా జడ్, సోనీ ఎక్స్ పీరియా ఎస్2, సోనీ ఎక్స్ పీరియా ఆర్క్ 3, ఆసుస్ ఈప్యాడ్ ట్రాన్స్ ఫార్మర్, ఏసర్ ఐసోనియా ట్యాబ్ ఏ5003 ఫోన్లలో అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి