24 ఏళ్ల ఇన్ ఫ్వుఎన్సర్ మృతి.. లైవ్ స్ట్రీమింగ్ లో తింటూనే ప్రాణాలు కోల్పోయింది!

Influencer Pan Xiaoting Passed Away Due To Over Eating: 24 ఏళ్ల ఇన్ ఫ్లుఎన్సర్ అతిగా ఆహారం తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 10 గంటల పాటు ఆమె నాన్ స్టాప్ గా తినడం వల్లే చనిపోయింది అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది.

Influencer Pan Xiaoting Passed Away Due To Over Eating: 24 ఏళ్ల ఇన్ ఫ్లుఎన్సర్ అతిగా ఆహారం తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోయింది. దాదాపు 10 గంటల పాటు ఆమె నాన్ స్టాప్ గా తినడం వల్లే చనిపోయింది అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది.

ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అవ్వాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది కొత్త కొత్త కంటెంట్ క్రియేట్ చేస్తూ నెటిజన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్నారు. కొందరు ఇన్ఫర్మేటివ్ చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం వ్లాగ్స్, కామెడీ చేస్తూ అలరిస్తున్నారు. కొందరు మాత్రం తినడాన్ని వీడియోగా చేసి పెట్టి వ్యూస్, ఫాలోవర్స్ ని పొందుతున్నారు. అయితే అతిగా తినడం ఎప్పటికైనా ప్రమాదమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ విషయాన్ని కొన్ని చెప్పడానికి ఒక చైనా ఇన్ ఫ్లుఎన్సర్ మృతినే ఉదాహరణగా చెప్పచ్చు. 24 ఏళ్ల ఆ యువతి ఈటింగ్ ఛాలెంజ్ తీసుకుని అతిగా తింటూ లైవ్ స్ట్రీమింగ్ లోనే ప్రాణాలు కోల్పోయింది.

ఇప్పుడు చెప్పుకుంటున్న యువతి పేరు పాన్ జియోటింగ్. ఈమెకు 24 సంవత్సరాలు. ఈటింగ్ ఛాలెంజెస్ తీసుకుని వాటిని లైవ్ స్ట్రీమ్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉంటుంది. అయితే ఆమెను ఇలా తినడానికి సంబంధించి తల్లిదండ్రులు హెచ్చరించేవారట. కానీ, ఆమె మాత్రం వారి మాటలను పట్టించుకోలేదు. వారి మాటలను పెడచెవిన పెట్టడంతో అనుకున్న అనర్థం జరగనే జరిగింది. ఈ ఘటన జులై 14న జరిగినట్లు చైనా స్థానిక మీడియా కథనాలు వెల్లడించింది. ఆమె ఎప్పటిలాగానే ఈటింగ్ ఛాలెంజ్ తీసుకుంది. ఆమె తింటూనే ప్రాణాలు కోల్పోయింది. తర్వాత వైద్యులు పరీక్షించి.. అరగడానికి కూడా వీలు లేనంతగా ఆహారం తినడం వల్లే ఆమె చనిపోయినట్లు ధృవీకరించారు.

పాన్ జియోటింగ్ 10 గంటల కంటే కూడా ఎక్కువసేపు తినడం వల్ల ప్రాణాలు కోల్పోయింది అంటున్నారు. ఆమె ఎప్పుడూ అతిగానే తింటుందంట. ఒక్కోసారి 10 కిలోల కంటే కూడా ఎక్కువ ఆహారాన్ని తింటూ ఉంటుందట. ఆ విషయం మీదే తల్లిదండ్రులు ఆమెను హెచ్చరించారట. కానీ, ఆమె మాత్రం వారి మాట వినలేదు. చివరకు అలా ఆహారం తింటూనే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె వయసు కేవలం 24 సంవత్సరాలు కావడం అందరినీ కలచి వేస్తోంది. ఏం చేసినా కూడా దానికి ఒక పరిధి ఉండాలి అని హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో చాలా మంది ఫుడ్ ఛాలెంజెస్ తీసుకుని వాటిని వీడియోలు చేసి పెట్టే వాళ్లు ఉన్నారు. కానీ, వాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక ఫుడ్ ఛాలెంజ్ చేస్తుంటే.. దానికి తగినట్లు వాళ్ల శరీరాన్ని తయారు చేసుకుంటారు. అలాగే ఆ తిన్నది అరగడానికి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈమె మాత్రం అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు అనిపించలేదు. ఈ ఘటనను ఒక హెచ్చరికగా తీసుకుని.. ఫుడ్ ఛాలెంజెస్ చేసే ఇన్ ఫ్లుఎన్సర్స్ కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments