iDreamPost
android-app
ios-app

1965 నాటి టిఫిన్స్ ధరలు.. ఇడ్లీ, వడ 15 పైసలే! ఇంత తక్కువా?

  • Published Mar 18, 2024 | 3:04 PM Updated Updated Mar 18, 2024 | 3:04 PM

ఇప్పుడున్న రోజుల్లో తినడానికి ఒక సాధారణ హోటల్ కు వెళ్లినా కూడా బిల్ వంద రూపాయలు దాటాల్సిందే. బయట ధరలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఇప్పుడు తాజాగా 1965 నాటి టిఫిన్ రేట్స్ పాంప్లెట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పుడున్న రోజుల్లో తినడానికి ఒక సాధారణ హోటల్ కు వెళ్లినా కూడా బిల్ వంద రూపాయలు దాటాల్సిందే. బయట ధరలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఇప్పుడు తాజాగా 1965 నాటి టిఫిన్ రేట్స్ పాంప్లెట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Published Mar 18, 2024 | 3:04 PMUpdated Mar 18, 2024 | 3:04 PM
1965 నాటి టిఫిన్స్ ధరలు.. ఇడ్లీ, వడ 15 పైసలే! ఇంత తక్కువా?

ప్రస్తుతం బయట హోటల్స్, రెస్టారెంట్స్ అధిక మొత్తంలో ఉన్న సంగతి తెలిసిందే. తినడానికి ఏదైనా ఒక హోటల్ కు వెళ్ళమంటే.. ఫుడ్ బిల్ తో పాటు.. టాక్స్ , జీఎస్టీ , సీజీఎస్టీ కట్టాల్సిందే. పైగా ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉంటాయి తప్ప తరగవు. అంతేకాకుండా ఇప్పుడు ఎవరి బిజినెస్ ఐడియా అడిగినా సరే.. అందరు చెప్పేది ఫుడ్ బిజినెస్ గురించే. అయితే, పూర్వం హోటల్స్ లో ఇలా టాక్స్, జీఎస్టీ లు ఉండేవి కావు. ఇంకా రేట్స్ కూడా చాలా తక్కువగా ఉండేవి. ఈ క్రమంలో తాజాగా రేపల్లెలోని ఓ హోటల్ లో 1965 నవంబర్ 1వ తారీఖున ప్రింట్ అయినా.. టిఫిన్ రేట్స్ కు సంబంధించిన పాంప్లెట్ ఒకటి సోషల్ మీడియాలో ఇంటెస్టింగ్ గా మారింది. ఆ పాంప్లెట్ లోని ధరలను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

కాగా, ఆ పాంప్లెట్ లో ఉన్న టిఫిన్స్ ధరలు కూడా.. ధరల పెంచిన తర్వాత ప్రింట్ చేసినవే. ఆ పాంప్లెట్ ప్రింట్ చేసింది కూడా.. ఈ విషయాన్ని అందరికి తెలియపరచడానికే. అప్పట్లో రెండు ఇడ్లిలు 15పైసలు, ఇక ఉప్మా, అటు కూడా 15 పైసలే. ఒక ఇడ్లి ధర 08పైసలు, కారం, గారే కూడా 15 పైసలే ఉంది. రవ్వ అట్టు, మసాలా గారే, బోండా మాత్రం 20పైసలు ఉంది. ఇకపోతే కాఫీ, టీ ధరలు 15 పైసలు. అందులోను సగం కాఫీ, టీ ధర అయితే 12 పైసలు మాత్రమే. ఈ ధరలతో ఉన్న ఈ పాంప్లెట్ ను చూసి ఇప్పుడు నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. చెప్పాలంటే అసలు ఇప్పుడు పైసలే కనుమరుగైపోయాయి. ప్రస్తుతం ఈ పాంప్లెట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇప్పుడు నిత్యావసర ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా బయట హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో ఆహరం ఏమైనా బావుంటుందా అంటే.. అవి కూడా రోజు రోజుకి కలుషితం అవుతూ ఉన్నాయి. అంతేకాకుండా వాటి ధరలు కూడా ఆకాశాన్ని అంటేలా ఉంటాయి. అటు ఇళ్లలో వండుకోవడానికి సమయం లేక.. ఇటు వేరే వెసులుబాటు లేక .. ప్రజలు కూడా బయట ఆహారానికే అలవాటు పడిపోయారు. ఇక ఇప్పటివారికి ఇవన్నీ చాలా రొటీన్ అయిపోయాయి. దీనితో సోషల్ మీడియాలో ఒక్కసారిగా 1965 నాటి టిఫిన్ రేట్స్ ను చూసి.. నెటిజన్లు ఆశ్చర్యపోయారు. మరి, ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.