iDreamPost
android-app
ios-app

నాలుగో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నటి వనితా విజయ్‌ కుమార్‌!

నాలుగో పెళ్లిపై క్లారిటీ  ఇచ్చిన నటి వనితా విజయ్‌ కుమార్‌!

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘వనితా విజయ్‌కుమార్‌’. 1999లో వచ్చిన ‘దేవి’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారామె. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేశారు. తాజాగా, ఆమె ‘మళ్లీ పెళ్లి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నటులు నరేష్‌-పవిత్రా లోకేష్‌ల జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. సౌమ్యా సేతుపతిగా నటించి వావ్‌ అనిపించారు.

ఇక, ఆమె విడాకులు, మళ్లీ పెళ్లిపై ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ తెలుగు మీడియా యాంకర్‌ నన్నో ప్రశ్న అడిగింది. మీకెప్పుడు ‘మళ్లీ పెళ్లి’  అని ప్రశ్నించింది. నాకు పెళ్లి అయిందని నేను చెప్పాను. ఏంటి నిజమా అని వారు ఆశ్చర్యపోయారు. అవునండి.. నేను సినిమాను మళ్లీ పెళ్లి చేసుకున్నా.. మధ్యలో విడాకులు తీసుకుని ఉంటిని. ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకున్నా.. నా జీవితాంతం నాతో పాటు ఉండోబోయేది సినిమా అని నేను మానసికంగా ఫిక్స్‌ అయ్యాను. చివర్లో ఏం జరుగుతుందో జరగనివ్వండి. నేను సినిమాల్లో పని చేయాలన్న ఆలోచనతో పెళ్లి చేసుకున్నా.. ఇదే నా జీవితంలో ముఖ్యమైన కమిట్‌మెంట్‌.

అటువంటి పరిస్థితిలోకి నేను వచ్చాను. ఇదంతా పెళ్లి గురించి కాదు.. ఓ బంధం గురించి.. ఎవరో ఒకరు మన జీవితంలో ఉండాలన్నది అసలు విషయం. ఓ తోడు కోసం. ఓ వయసు దాటిన తర్వాత ఎవ్వరికైనా తోడు అవసరం. నా జీవితంలో చోటుచేసుకున్న బ్రేకప్‌లకు పరిస్థితులే ప్రధాన కారణం. మనుషుల్ని నేను తప్పు బట్టను’’ అని అన్నారు. కాగా,  వనిత ప్రస్తుతం ‘అందగాన్‌’ తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది. మరి, తాను సినిమానే మళ్లీ పెళ్లి చేసుకున్నాన్న వనితా విజయ్‌ కుమార్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.