iDreamPost
android-app
ios-app

Choreographer Jani: జానీ మాస్టర్ రేప్ కేసుకి ఆ సినిమా గొడవే కారణమా? అసలు ఏం జరిగిందంటే?

  • Published Sep 20, 2024 | 7:04 PM Updated Updated Sep 20, 2024 | 7:04 PM

Choreographer Jani: పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్‌ పీక్ స్టేజీలో ఉన్నాడు. ఆయన సాంగులు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఇలాంటి టైమ్ నడుస్తున్నప్పుడు ఆయనపై పడిన లైంగిక వేధింపుల కేసు తీవ్ర సంచలనం రేపింది.

Choreographer Jani: పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్‌ పీక్ స్టేజీలో ఉన్నాడు. ఆయన సాంగులు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఇలాంటి టైమ్ నడుస్తున్నప్పుడు ఆయనపై పడిన లైంగిక వేధింపుల కేసు తీవ్ర సంచలనం రేపింది.

  • Published Sep 20, 2024 | 7:04 PMUpdated Sep 20, 2024 | 7:04 PM
Choreographer Jani: జానీ మాస్టర్ రేప్ కేసుకి ఆ సినిమా గొడవే కారణమా? అసలు ఏం జరిగిందంటే?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్‌ పీక్ స్టేజీలో ఉన్నాడు. ఆయన కొరియోగ్రఫీ చేసిన సాంగులు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఇలాంటి పీక్ టైమ్ నడుస్తున్నప్పుడు ఆయనపై పడిన లైంగిక వేధింపుల కేసు తీవ్ర సంచలనం రేపింది. బాధితురాలు తనని చాలా సార్లు రేప్ చేశాడంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. అసలు ఎప్పటినుంచో వీరిద్దరి మధ్య కొనసాగుతున్న అనుబంధం ఎందుకు ముక్కలైంది? బాధితురాలు ఇప్పుడే ఎందుకు ఆయనపై ఈ ఆరోపణలు చేసి కంప్లైంట్ చేసింది? అసలు ఈ గోడవకు మూల కారణం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఓ పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షోలో డ్యాన్సర్‌ గా కొనసాగిన ఆమె జానీ మాస్టర్‌కు పరిచయం అయ్యింది. ఆయనతో క్లోజ్ అవ్వడం ప్రారంభించింది. ఆమె టాలెంట్ చూసి అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చారు జానీ. అయితే వారిద్దరి మధ్య గురుశిష్యుల బంధం కాస్త రిలేషన్‌షిప్ గా మారిందని ఇండస్ట్రీ వర్గాలు ద్వారా సమాచారం తెలిసింది. అలా జానీ మాస్టర్ తాను చేసే ప్రతి మూవీకి ఆమెకు అవకాశం ఇచ్చినట్టుగా సమాచారం తెలిసింది. ఆ క్రమంలోనే తాను హీరోగా చేసే ‘యధా రాజా తథా ప్రజా’ సినిమాలో ఆమెనే హీరోయిన్‌గా పెట్టుకున్నారు జానీ. ఆ సమయంలో జానీ మాస్టర్‌ను ఆమె పొగడ్తలతో ముంచేసిన విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమా కొన్ని కారణాల వల్ల స్టార్ట్ కాలేదు. ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ అమ్మాయికి కొన్ని మూవీ ఆఫర్లు వచ్చాయట. కానీ జానీ మాస్టర్ ఆ ఆఫర్లు తనకి రానివ్వకుండా ఆయన తెసుకున్నారని తెలుస్తుంది. అప్పటికీ అవన్నీ ఆమె భరిస్తూనే వచ్చింది. కానీ ఒక పెద్ద హీరో మూవీ విషయంలో మాత్రం పెద్ద తతంగమే నడిచినట్లు తెలుస్తుంది. పైగా అంతకుముందు ఆ పెద్ద హీరో మూవీలోని పాటలకు జానీ మాస్టర్ అద్భుతంగా కొరియోగ్రఫి చేశారు. అయితే ఆ పెద్ద హీరో చేస్తున్న మూవీ ఆఫర్ జానీకి వచ్చినట్టే వచ్చి ఆ తరువాత ప్రస్తుత బాధితురాలికి దక్కింది. ఈ కారణమే ఇంత పెద్ద వివాదానికి తెర తీసింది. ఈ విషయంలో ఆ పెద్ద హీరో సినిమా మేకర్స్ తో తనని తప్పించినందుకు జానీ గొడవ కూడా పడ్డాడట.

అలాగే పెద్ద హీరో సినిమాలో తనకు వచ్చిన ఆఫర్ బాధితురాలికి పోవడంతో ఆమెతో కూడా పెద్ద గొడవ పెట్టుకున్నాడట జానీ. దాంతో ఆ బాధితురాలు తట్టుకోలేక పోయింది. ఇన్నాళ్లు తనకు వచ్చిన అవకాశాలు జానీ పోగొట్టినా కూడా భరిస్తూ వచ్చింది ఆ అమ్మాయి. కానీ ఈ ఈ పెద్ద మూవీ విషయంలో మాత్రం చాలా పెద్ద గోడవే జరిగింది. దీంతో ఆమె ఇక ఈ గొడవలు భరించలేక విసుగు చెంది జానీ మాస్టర్‌పై కేసు పెట్టాలని నిర్ణయించుకుంది. అందుకే తీవ్రమైన ఆరోపణలతో ఆమె జానీపై కేసు పెట్టిందని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. ఇలా ఆ పెద్ద హీరో సినిమా ఈ వివాదానికి కారణమైందని సమాచారం. ఇక ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom