iDreamPost
android-app
ios-app

సాయి తేజ్ నెక్స్ట్ మూవీ టైటిల్ ఫిక్స్! మరీ ఇంత వెరైటీగా ఉందేంటి?

  • Author singhj Published - 07:20 PM, Thu - 13 July 23
  • Author singhj Published - 07:20 PM, Thu - 13 July 23
సాయి తేజ్ నెక్స్ట్ మూవీ టైటిల్ ఫిక్స్! మరీ ఇంత వెరైటీగా ఉందేంటి?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటారు. కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే.. ఛాన్స్ దొరికినప్పుడు వైవిధ్యమైన చిత్రాల్లోనూ ఆయన యాక్ట్ చేస్తుంటారు. దీంతో ఎలాంటి ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన ‘రిపబ్లిక్’, ‘విరూపాక్ష’ సినిమాలు ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. ‘రిపబ్లిక్’ సినిమా కమర్షియల్​గా వర్కౌట్ కాకపోయినా.. సబ్జెక్ట్ పరంగా కొత్తదనంతో సాగుతూ ప్రేక్షకుల్ని ఆలోచింపజేసింది. అందుకే ఆ మూవీకి కల్ట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే మరో ప్రయత్నంగా ఆయన చేసిన ‘విరూపాక్ష’ మాత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.

‘విరూపాక్ష’ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ చివరి వరకు ప్రేక్షకులను మునివేళ్లపై నిల్చోబెట్టింది. గ్రిప్పింగ్​ స్క్రీన్​ప్లేతో రూపొందిన ఈ మూవీకి ఆడియెన్స్​తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక సాయి తేజ్ నుంచి వచ్చిన మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఆనందంలో మునిగిపోయారు. దీంతో ఆయన నటించబోయే నెక్స్ట్ మూవీపై అందరి దృష్టి నెలకొంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎన్​ఎస్​ ప్రసాద్ నిర్మాణంలో కొత్త సినిమాకు సాయి తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీతో జయంత్ పానుగంటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్​ను మేకర్స్ ఫిక్స్ చేశారట.

సాయి తేజ్ కొత్త మూవీకి ‘చీటీల చిన్ని’ అనే టైటిల్​ను ఖరారు చేశారని టాలీవుడ్ టాక్. ఇందులో హీరో పాత్రను ఫైనాన్స్ బిజినెస్ చేసే యువకుడిగా డిజైన్ చేశారని సమాచారం. చీటీలు కట్టించుకోవడంతో పాటు అప్పులు ఇవ్వడం లాంటివి హీరో చేస్తుంటారట. సాయి తేజ్ రోల్ ఫుల్​ ఎంటర్​టైనింగ్​గా సాగుతూ నవ్వులు పంచుతుందని వినికిడి. ‘చీటీల చిన్ని’లో మెగా మేనల్లుడి సరసన సాక్షి వైద్య హీరోయిన్​గా యాక్ట్ చేయనున్నారట. అఖిల్ అక్కినేని ‘ఏజెంట్​’తో టాలీవుడ్​కు ఎంట్రీ ఇచ్చిన సాక్షి ఈ ఛాన్స్​ను ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి. అయితే ‘చీటీల చిన్ని’ టైటిల్​పై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. ఈ టైటిల్ ఏంట్రా బాబు, మరీ ఇంత వెరైటీగా ఉందని నెటిజన్స్ అంటున్నారు. అయితే మూవీ టీమ్ అధికారికంగా ప్రకటిస్తే గానీ ఈ టైటిల్ ఫిక్స్ అని చెప్పలేం.

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş