iDreamPost
android-app
ios-app

SS Rajamouli మహేష్ కోసం రాజమౌళి 2 కథలు

  • Published Apr 09, 2022 | 3:40 PM Updated Updated Apr 11, 2022 | 11:05 AM
SS Rajamouli మహేష్ కోసం రాజమౌళి 2 కథలు

SS Rajamouli film with Mahesh Babuఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి ఇంకో రెండు మూడు నెలల్లో మహేష్ బాబు స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టబోతున్నారు. అయితే జక్కన్న ఇప్పటిదాకా ఫైనల్ స్టోరీని లాక్ చేయలేదన్న విషయం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవలే ఒక నేషనల్ మీడియాకు ఇచ్చిన జూమ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ కోసం రెండు లైన్లు సిద్ధం చేశామని అందులో ఒకటి తెరకెక్కిస్తామని చెప్పడంతో అదేంటనేది సస్పెన్స్ గా మారిపోయింది. అయితే మెయిన్ ప్లాట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని క్లూ ఇచ్చారు కాబట్టి బాహుబలి, ట్రిపులార్ రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ ని ఇందులో ఎంజాయ్ చేయొచ్చన్న మాట

రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ఇలాంటి హింట్స్ ఇచ్చారు కానీ మొత్తానికి పూర్తి క్లారిటీ అయితే ఇంకా రాలేదు. మహేష్ జక్కన్న కాంబినేషన్ కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్న ప్రిన్స్ అభిమానులు ఇంకా తమ వెయిటింగ్ ని పొడిగించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సర్కారు వార్ పాట తర్వాత మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టులో బిజీ అయిపోతాడు. అదయ్యాక వెంటనే రాజమౌళి మూవీ ఉంటుందా లేక ఇంకో సినిమా ఏదైనా చేస్తారా అనేది వేచి చూడాలి. కావాలని చేయకపోయినా జక్కన్న ఏదీ టేకప్ చేసినా రకరకాల కారణాల వల్ల పూర్తవ్వడానికి కనీసం మూడేళ్లు పడుతోంది. మహేష్ ది వేగంగా అవుతుందనుకోలేం.

హిందీ సినిమాలు చేయనని ఖరాఖండిగా చెప్పేసిన మహేష్ కు ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రొజెక్ట్ కావడానికి ఈ మూవీనే మంచి అవకాశం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఎలా అయితే నార్త్ ఆడియన్స్ లో ఫ్యాన్ బేస్ పెంచుకున్నారో తనకూ ఆ అవకాశం దక్కుతుంది. ఎలాగూ రాజమౌళి తెలుగులో మాత్రమే తీస్తాడు. మిగిలినవి డబ్బింగ్ వెర్షన్లే. సో స్పైడర్ లాగా బైలింగ్వల్ తీయాలనే ఒత్తిడేమి ఉండదు. హిందీలో అడపాదడపా మహేష్ చిత్రాలు డబ్బింగ్ చేశారు కానీపెద్దగా ఆడినవి లేవు. ఒక్కడు, పోకిరిలు రీమేక్ కావడంతో వాటిని అనువదించే ఛాన్స్ లేకుండా పోయింది. సో అన్ని రకాలుగా మహేష్ కు ఇది సూపర్ బొనాంజానే.