iDreamPost
android-app
ios-app

TFCC ఎన్నికల్లో నిర్మాత దిల్ రాజు ప్యానెల్ ఘన విజయం!

  • Author naresh1 Published - 09:49 PM, Sun - 30 July 23
  • Author naresh1 Published - 09:49 PM, Sun - 30 July 23
TFCC ఎన్నికల్లో నిర్మాత దిల్ రాజు ప్యానెల్ ఘన విజయం!

ఆదివారం హోరోహోరిగా సాగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ TFCC ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ ఘన విజయం సాధించింది. ప్రొడ్యూసర్‌ సెక్టార్‌లోని మొత్తం 12 స్థానాల్లో ఏడింటిలో దిల్‌రాజు ప్యానల్‌ గెలుపొందింది. అందులో దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, మోహన్ వడ్ల పాటి, స్రవంతి రవికిశోర్, పద్మిని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ గౌడ్ లు నిర్మాతల ప్యానెల్ నుంచి విజయం సాధించారు. డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌లో రెండు ప్యానల్స్‌ నుంచి చెరో ఆరుగురు విజయాన్ని సాధించారు (1/2). మొత్తం 14 రౌండ్లలో దిల్ రాజు ప్యానెల్ కు 563 ఓట్లు రాగా, సీ. కళ్యాణ్ 497 ఓట్లు మాత్రమే వచ్చాయి.

స్టూడియో సెక్టార్ నుంచి నలుగురికి గాను, ముగ్గురు దిల్ రాజు ప్యానెల్ నుంచి గెలుపొందారు. ఇక అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఈ ఎన్నికల ఫలితాల్లో సీ కల్యాణ్ ప్యానెల్ పై దిల్ రాజు ప్యానెల్ విజయం సాధించింది. ఈ విజయంతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా దిల్ రాజు ఎన్నికయ్యారు. అలాగే వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామ్ దాస్, సెక్రటరీగా దామోదర్ ప్రసాద్, ట్రెజరర్ గా టీ ప్రసన్నకుమార్ ఎంపికయ్యారు. ప్రొడ్యూసర్ సెక్టర్ ఛైర్మన్ గా శివలంక కృష్ణ ప్రసాద్, డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ ఛైర్మన్ గా మిక్కిలినేని సుధాకర్ ఎన్నికయ్యారు.

ఈ ఎన్నికల్లో ఘన విజయం నమోదు చేయడంపై దిల్ రాజు ప్యానెల్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. పలువురు సినీ ప్రముఖులు దిల్ రాజుకు, ప్యానెల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఎన్నికల కంటే ముందే పలువురు ఈసారి గెలుపు దిల్ రాజదే అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన నిలబడాలి అనుకున్నప్పుడే ఆయన గెలుపు దాదాపు ఖరారు అయిపోంది అన్నారు. ఆ కామెంట్స్ చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ఇండస్ట్రీపై దిల్ రాజుకు ఉన్న పట్టు, ఇండస్ట్రీతో సంబంధాలు ఎలాంటివి అనేది. మరి.. దిల్ రాజు ప్యానెల్ కు మీ శుభాకాంక్షలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet