iDreamPost
android-app
ios-app

ఈ వారం ఓటీటీలోకి 18 సినిమాలు.. ఈ మూడు అస్సలు మిస్ అవ్వొద్దు!

  • Author singhj Published - 05:11 PM, Mon - 2 October 23
  • Author singhj Published - 05:11 PM, Mon - 2 October 23
ఈ వారం ఓటీటీలోకి 18 సినిమాలు.. ఈ మూడు అస్సలు మిస్ అవ్వొద్దు!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు మీడియం రేంజ్, చిన్న సినిమాలే హవా. గత వారం థియేటర్లలోకి వచ్చిన రామ్ ‘స్కంద’, శ్రీకాంత్ అడ్డాల తీసిన ‘పెదకాపు-1’కు మిక్స్​డ్ టాక్ వచ్చింది. డ్యాన్స్ మాస్టర్ రాఘవా లారెన్స్ నటించిన ‘చంద్రముఖి’ డివైట్ టాక్ అందుకుంది. వీక్ డేస్​లో వచ్చే కలెక్షన్స్ మీదే ఈ సినిమాల రిజల్ట్ ఆధారపడింది. మరో రెండు వారాల్లో దసరా సందడి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో షూటింగ్ పూర్తి చేసుకున్న చిన్న చిత్రాలన్నీ బాక్సాఫీస్​కు క్యూ కట్టాయి. వాటిలో చిన్న సినిమాలతో పాటు మీడియం రేంజ్ మూవీస్ కూడా ఉన్నాయి. సుధీర్ బాబు యాక్ట్ చేస్తున్న ‘మామ మశ్చీంద్ర’ సినిమా అక్టోబర్ 6న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ ఫిల్మ్​ను హర్షవర్దన్ డైరెక్ట్ చేశారు.

వినూత్నమైన కాన్సెప్ట్​తో రూపొందిన ‘మామ మశ్చీంద్ర’ మూవీని అక్టోబర్ 6న తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోతున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. నేహాశెట్టితో కలసి ఆయన నటించిన కొత్త చిత్రం ‘రూల్స్ రంజన్’. రత్నం కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. నవీన్ చంద్ర, స్వాతి జంటగా నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ కూడా ఇదే రోజున విడుదలవుతోంది. అలాగే సితార ఎంటర్​టైన్​మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’, లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ‘800’, స్టార్ హీరో సిద్ధార్థ్ యాక్ట్ చేసిన ‘చిన్నా’ సినిమాలు కూడా ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి.

ఈ వారం థియేటర్లపై చిన్న సినిమాలు దండయాత్ర చేస్తున్నాయి. అదే సమయంలో ఓటీటీలోనూ కొన్ని ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్​లు విడుదల కానున్నాయి. ఈ వారం ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు/వెబ్ సిరీస్​లు స్ట్రీమింగ్​ అవ్వనున్నాయి. వాటిల్లో నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టిలు కలసి నటించిన ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ మూవీతో పాటు హిందీలో డబుల్ బ్లాక్​బస్టర్​గా నిలిచిన ‘గదర్ 2’, పాపులర్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ‘లోకి’ని అస్సలు మిస్సవ్వొద్దు.

ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలు/వెబ్ సిరీస్​లు ఇవే..

డిస్నీ ప్లస్ హాట్​స్టార్

హంటెడ్ మాన్షన్ (ఇంగ్లీష్) – అక్టోబర్ 4
లోకి (వెబ్ సిరీస్) – అక్టోబర్ 6

అమెజాన్ ప్రైమ్

హర్కరా (మలయాళం) – అక్టోబర్ 1
ముంబై డైరీస్ (హిందీ) – అక్టోబర్ 4

నెట్​ఫ్లిక్స్

బెక్​హామ్ (వెబ్ సిరీస్) – అక్టోబర్ 4
మిస్​ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి – అక్టోబర్ 5
లుపిన్ (వెబ్​ సిరీస్) – అక్టోబర్ 5
ఖూఫియా (హిందీ) – అక్టోబర్ 5
ఎవ్రీథింగ్ నౌ (వెబ్ సిరీస్) – అక్టోబర్ 5
స్ట్రాంగ్ గర్ల్ నామ్-సూన్ (కొరియన్) – అక్టోబర్ 6
ఫెయిర్​ ప్లే (హాలీవుడ్) – అక్టోబర్ 6
ఇన్సిడియస్ (హాలీవుడ్) – అక్టోబర్ 6

ఆహా

మిస్టర్ ప్రెగ్నెంట్ (తెలుగు) – అక్టోబర్ 6
ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ (తెలుగు) – అక్టోబర్ 6

బుక్​ మై షో

ది నన్ 2 (హాలీవుడ్) – అక్టోబర్ 3
గ్రాన్ టురిస్​మో (హాలీవుడ్) – అక్టోబర్ 5
ఆస్ట్రరాయిడ్ సిటీ (హాలీవుడ్) – అక్టోబర్ 6

జీ5

గదర్ 2 (హిందీ) – అక్టోబర్ 6

ఇదీ చదవండి: బాలీవుడ్​ఫై తారక్ హీరోయిన్ సంచలన కామెంట్స్!

Jojobet GirişmeritbetmeritbetcasibomvbetjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin