Yash- Amitabh Bachchan దీవార్ విజయ్ TO కెజిఎఫ్ రాఖీ భాయ్

ఇప్పుడు సౌత్ లోనే కాదు నార్త్ లోనూ కెజిఎఫ్ 2 మేనియా మాములుగా లేదు. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో టికెట్లు దొరక్క మాస్ ప్రేక్షకులు థియేటర్ల దగ్గర క్యూ కడుతున్నారు. మన దగ్గరంటే సరేలే అనుకోవచ్చు కానీ ముంబై ఢిల్లీ లాంటి మెట్రో ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక బీహార్, యుపి, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల మాస్ సెంటర్స్ లో అరాచకం మాములుగా లేదు.

ఇదంతా ఓకే కానీ కెజిఎఫ్ రాఖీ భాయ్ కి అమితాబ్ కి కనెక్షన్ ఏంటనే అనుమానం వచ్చిందా. మీరే చూడండి. దర్శకుడు ప్రశాంత్ నీల్ పలు ఇంటర్వ్యూలలో తను ఈ స్థాయిలో మాస్ ఎలివేషన్లు చూపించడానికి కారణం తెలుగులో చిరంజీవి, హిందీలో అమితాబ్ బచ్చన్ సినిమాలేనని చెప్పాడు. కెజిఎఫ్ లో హీరో క్యారెక్టరైజేషన్ ని చూసుకుంటే మనకో క్లాసిక్ గుర్తుకొస్తుంది. అదేంటో చూద్దాం.

1975లో దీవార్ అనే బ్లాక్ బస్టర్ బిగ్ బి అమితాబ్ కి మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. పోర్టులో పని చేసే ఒక మాములు లేబర్ ముంబైని శాశించే డాన్ గా ఎదుగుతాడు. ఈ పాత్ర కూడా రాఖీ భాయ్ లాగే భయం లేకుండా తలపొగరుతో ఎవరినైనా లెక్క చేయని మనస్తత్వంతో ఉంటుంది. దీవార్ లోనూ బలమైన మదర్ సెంటిమెంట్ ఉంటుంది. మరి స్ఫూర్తి కాదని ఎలా చెప్పగలం.

Show comments