iDreamPost
android-app
ios-app

కౌన్ బనేగా కరోడ్‌పతిలో కోటి గెలిచాడు.. రూ. 7 కోట్ల ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా..

  • Published Sep 26, 2024 | 11:50 AM Updated Updated Sep 26, 2024 | 12:02 PM

Kaun Banega Crorepati: కౌన్ బనేగా కరోడ్ పతి షోలో సంచలనం సృష్టించాడు ఓ 22 ఏళ్ల యువకుడు. ఈ షోలో ఏకంగా కోటి రూపాయలు గెలుచుకుని సత్తాచాటాడు. ఆ తర్వాత రూ. 7 కోట్ల ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా మిచ్ చేసుకున్నాడు.

Kaun Banega Crorepati: కౌన్ బనేగా కరోడ్ పతి షోలో సంచలనం సృష్టించాడు ఓ 22 ఏళ్ల యువకుడు. ఈ షోలో ఏకంగా కోటి రూపాయలు గెలుచుకుని సత్తాచాటాడు. ఆ తర్వాత రూ. 7 కోట్ల ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా మిచ్ చేసుకున్నాడు.

కౌన్ బనేగా కరోడ్‌పతిలో కోటి గెలిచాడు.. రూ. 7 కోట్ల ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా..

కౌన్ బనేగా కరోడ్ పతి రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ పొందింది. ఇప్పటికే 15 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 16వ సీజన్ నడుస్తోంది. ఈ కేబీసీ షోకి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సామాన్యులు సైతం కోటీశ్వరులయ్యే అవకాశం కల్పిస్తోంది కేబీసీ. కోటీశ్వరులు అయ్యేందుకు కావాల్సిందల్లా అన్ని అంశాలపై నాలెడ్జ్ కలిగి ఉండాలి. కేబీసీలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ కోట్ల రూపాయాలను సొంతం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ షో ద్వారా పలువురు కంటెస్టెంట్స్ కోటి రూపాయలను గెలుచుకుని సత్తాచాటిన విషయం తెలిసిందే.

తాజాగా జరుగుతున్న సీజన్ లో 22 ఏళ్ల యువకుడు చందర్ ప్రకాశ్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. కేబీసీ షోలో ఏకంగా కోటి రూపాయలు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత రూ. 7 కోట్ల ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా ఆ మొత్తాన్ని గెలుచుకోలేకపోయాడు. మరి చందర్ ప్రకాశ్ ఆన్సర్ తెలిసి కూడా ఎందుకు చెప్పలేకపోయాడు. దానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కేబీసీ 16వ సీజన్ లో భాగంగా బుధవారం జరిగిన ఎపిసోడ్ లో సంచలనం చోటుచేసుకుంది. ఈ ఎపిసోడ్ లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన చందర్ ప్రకాశ్ రూ. కోటి ప్రశ్నకు చేరుకున్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే.. ఏ దేశంలో అతిపెద్ద నగరం దాని రాజధాని కాదు కానీ.. శాంతి నివాసం అనే అరబిక్ పేరుతో ఆ నగరం ఓ పోర్టును కలిగి ఉంది అని అమితాబ్ ప్రశ్న అడిగారు. దీనికి ఎ. సోమాలియా, బీ. ఒమన్, సీ. టాంజానియా, డి. బ్రూనై నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు.

ఈ ప్రశ్నకు సమాధానం కోసం చందర్ ప్రకాశ్ డబుల్ డిప్ లైఫ్ లైన్ ను ఉపయోగించుకుని ఆప్షన్ సీ టాంజానియాను ఎంచుకున్నాడు. అది సరైన సమాధానం కావడంతో రూ. కోటి గెలుచుకున్నట్లు బిగ్ బీ ప్రకటించాడు. కోటితో పాటు ఓ కారును కూడా బహుమతిగా అందుకున్నాడు. దీంతో చందర్ ప్రకాశ్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. షోలో ఉన్నవారంతా చప్పట్లతో అభినందించారు. ఈ క్రమంలో చందర్ ప్రకాశ్ రూ. 7 కోట్ల ప్రశ్నకు చేరుకున్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే? 1587లో ఉత్తర అమెరికాలో ఇంగ్లీష్ దంపతులకు జన్మించిన మొట్టమొదటి బిడ్డ ఎవరు? అనే ప్రశ్న ఎదురైంది. అప్పటి వరకు సరైన సమాధానాలతో దూసుకెళ్లిన చందర్ ప్రకాశ్ ప్రయాణానికి బ్రేకులు పడ్డాయి. రూ. 7 కోట్ల ప్రశ్నకు ఆన్సర్ తెలియకపోవడంతో అతడు ఒక్కసారిగా నిరాశలో కూరుకుపోయాడు.

అప్పటికే లైఫ్ లైన్స్ అన్నీ యూజ్ చేసుకున్నాడు. ఇక షో నుంచి క్విట్ అవ్వడం తప్పా వేరే మార్గం కనిపించలేదు చందర్ ప్రకాశ్ కు. రిస్క్ తీసుకోకుండా గేమ్ నుంచి నిష్క్రమించాడు. షో నుంచి క్విట్ అయిన తర్వాత అతడిని అమితాబ్ ఆ ప్రశ్నకు ఆన్సర్ ఊహించమని అడిగారు. వెంటనే చందర్ ప్రకాశ్ ఆప్షన్ ఏ. వర్జనీయా డేర్ అని చెప్పాడు. వెంటనే బిగ్ బీ అదే సరైన సమాధానం అని చెప్పాడు. సమాధానం తెలిసి కూడా రూ. 7 కోట్లు మిస్ చేసుకున్నాడంటూ ప్రేక్షకులు చర్చించుకున్నారు. ముందుగానే ధైర్యం చేసి సమాధానం చెప్తే రూ. 7 కోట్లు వచ్చేవని.. ఈ ముచ్చట తెలిసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు. మరికొంత మంది రిస్క్ తీసుకోకుండా షో నుంచి క్విట్ అవ్వడమే కరెక్ట్ పని అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)