iDreamPost
android-app
ios-app

మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో అమితాబ్? ప్రశాంత్ వర్మ ప్లాన్ మామూలుగా లేదు..

  • Published Aug 21, 2024 | 10:22 AM Updated Updated Aug 21, 2024 | 10:22 AM

Mokshagna Teja-Amitabh Bachchan: మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

Mokshagna Teja-Amitabh Bachchan: మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో అమితాబ్? ప్రశాంత్ వర్మ ప్లాన్ మామూలుగా లేదు..

నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. తన వారసుడి ఎంట్రీని టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు బాలయ్య. ఇక ఇప్పటికే కథకు సంబంధించిన పనులు పూర్తి అయ్యాయని టాక్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ రంగం సిద్ధమైంది. బాలయ్య ఈ బాధ్యతలను ప్రశాంత్ వర్మపై పెట్టారు. ఇక ఈ టాలెంటెడ్ డైరెక్టర్ సైతం నందమూరి నటవారసుడిని ఓ రేంజ్ లో చూపించాలని పక్కా ప్రణాళికలతో రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో ఈ కాంబోకు సంబంధించిన ఓ న్యూస్ పరిశ్రమలో తెగ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రకు అమితాబ్ ను తీసుకోవాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నాడట. ఈ పాత్రకు బిగ్ బి అయితేనే న్యాయం చేస్తాడు అన్నది ప్రశాంత్ ఆలోచన. ఇందుకోసం త్వరలోనే అమితాబ్ ను సంప్రదించబోతున్నట్లు సమాచారం.

Amitabh in Mokshajna movie

అయితే..  అమితాబ్ ను ఈ మూవీలోకి తీసుకోవడం ద్వారా బాలీవుడ్ లో కూడా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వొచ్చు అన్నది ప్రశాంత్ వర్మ ప్లాన్. అది ఇటు మోక్షజ్ఞకు, తనకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అదీకాక ఈ మూవీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అని కొందరు అంటున్నారు. అభిమన్యుడి పాత్రలో నందమూరి వారసుడిని చూపించబోతున్నాడని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగా.. డైరెక్టర్ కృష్ణవంశీ, బాలయ్య-అమితాబ్ కాంబినేషన్ లో గతంలో ఓ చిత్రం రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయ్యింది. మరిప్పుడు బాలయ్య కొడుకు సినిమాలో బిగ్ బి నటిస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.