iDreamPost
android-app
ios-app

ఐష్‌తో విడాకులపై క్లారిటీ అభిషేక్ బచ్చన్ క్లారిటీ! క్షమించండి అంటూ!

  • Published Aug 12, 2024 | 4:13 PM Updated Updated Aug 12, 2024 | 4:13 PM

Abhishek Bachchan: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ప్రేమ వివాహాలు చేసుకున్నారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఏప్రిల్ 2007 లో లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంటపై పలు రకాల వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Abhishek Bachchan: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ప్రేమ వివాహాలు చేసుకున్నారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఏప్రిల్ 2007 లో లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంటపై పలు రకాల వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  • Published Aug 12, 2024 | 4:13 PMUpdated Aug 12, 2024 | 4:13 PM
ఐష్‌తో విడాకులపై క్లారిటీ అభిషేక్ బచ్చన్ క్లారిటీ! క్షమించండి అంటూ!

బాలీవుడ్ స్టార్ కపుల్ గా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ లకు సపెరేట్ ఫ్యాన్ బేస్ వుంది. స్టార్స్ గా పీక్ స్టేజి లో కొనసాగుతున్న టైములో ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తరువాత సుదీర్ఘ కాలం పాటు వారి దాంపత్య జీవితం సంతోషంగానే సాగింది. అయితే.. గత కొంతకాలంగా ఈ జంట విడాకులు తీసుకున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైగా.. ఈ రూమర్స్ నిజం అన్నట్లుగా అనంత్ అంబానీ పెళ్లిలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడివిడిగా ఫోటోలకు ఫోజులిచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా విడాకులు నిజమే అని అభిషేక్ చెబుతున్నట్లు ఓ డీప్ ఫేక్ వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశంపై ఇంతలా రోజుకో రూమర్ బయటకి వస్తుండటంతో.. విడాకుల వార్తల గురించి అభిషేక్ బచ్చన్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

“నేను మా విడాకుల గురించి మీతో చెప్పడానికి ఏమీ లేదు. మీరందరూ ఇప్పటికే మా విడాకుల విషయం నిజమే అన్నట్టు బయటపెట్టారు. మీరు ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారో నాకు పూర్తిగా అర్థమైంది. మీకు ఎలాగైనా కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలి. ఏం ఫర్వాలేదు.. మేము సెలబ్రిటీలం కాబట్టి, ఇలాంటి వార్తలను సింపుల్ గా తీసుకుంటాం. కానీ, క్షమించండి” అంటూ అభిషేక్ బచ్చన్ తన చేతి ఉంగరాన్ని చూపించాడు. దీన్ని బట్టి అభిషేక్ ఈ వార్తలు నిజం కావని, తాము ఎలాంటి విడాకులు తీసుకోలేదని క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. అయితే.., తమ మధ్య ఎలాంటి బ్రేకప్ జరగలేదు అన్నది నిజం అయితే.. ఈ స్టార్ కపుల్ ఇంత కాలం ఎందుకు సైలెంట్ గా ఉండిపోయారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.

మొత్తానికి వీరి విడాకుల వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలింది. ఈ వార్తలకు అభిషేక్ క్లారిటీతో ఫుల్ స్టాప్ పడింది. ప్రస్తుతం ఐష్, అభిషేక్ హ్యాపీగానే కలిసి వున్నారు. ఇక అభిషేక్ బచ్చన్ సినిమాల విషయానికి వస్తే.. నేషనల్ అవార్డ్ విన్నర్ షూజిత్ సిర్కార్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 15న విడుదల కాబోతుంది. అలాగే ‘హౌస్ ఫుల్ 5’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2025 సమ్మర్లో రానుంది. ఇక ఐశ్వర్య రాయ్ విషయానికి వస్తే.. గతేడాది ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమాతో మెప్పించింది. ప్రస్తుతం ఏ సినిమాకి కమిట్ అవ్వలేదు. ఏదేమైనా.. అభిషేక్ క్లారిటీతో అయినా స్టార్ కపుల్ విడాకుల రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడుతుంది ఏమో చూడాలి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş