iDreamPost
android-app
ios-app

కల్కి 2898ఏడీలో ఈ నటి ఎవరో తెలుసా..? యాక్టర్ మాత్రమే కాదు మల్టీటాలెంటర్

గ్లోబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఇందులో బిగ్ స్టార్స్ కే కాదు.. చిన్నచిన్న క్యారెక్టర్లలో మెరిసిన నటీనటులకు కూడా మంచి గుర్తింపు దక్కింది. వాటిల్లో ఒకటి లిల్లీ. ఇంతకు ఆ నటి ఎవరో తెలుసా..?

గ్లోబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఇందులో బిగ్ స్టార్స్ కే కాదు.. చిన్నచిన్న క్యారెక్టర్లలో మెరిసిన నటీనటులకు కూడా మంచి గుర్తింపు దక్కింది. వాటిల్లో ఒకటి లిల్లీ. ఇంతకు ఆ నటి ఎవరో తెలుసా..?

కల్కి 2898ఏడీలో ఈ నటి ఎవరో తెలుసా..? యాక్టర్ మాత్రమే కాదు మల్టీటాలెంటర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ దర్వకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ ఏడాది జూన్ 27న విడుదల ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది. హాలీవుడ్ రేంజ్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా తెరకెక్కించిన ఈ చిత్రం.. అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం గమనార్హం. బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ యాక్టింగ్ సినిమాకు అదనపు ఆకర్షణ. బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొణే, దిశా పటాని ఆకట్టుకున్నారు. వీళ్లే కాకుండా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రాజమౌళి, ఆర్జీవీ, మృణాళ్ ఠాకూర్, ఫరియా అబ్దుల్లా వంటి క్యామియోస్ మూవీకి హైలెట్‌గా నిలిచారు. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం మంచి వ్యూస్ రాబట్టుకుంది.

ఇక ఇందులో నటించిన చిన్నచిన్న క్యారెక్టర్లకు కూడా మంచి గుర్తింపు దక్కింది. వాటిల్లో ఒకటి లిల్లీ రోల్ కూడా. ఆమె ఓ రెబల్. శంభాలకు చెందిన అమ్మాయి.. విలన్ గ్యాంగ్‌లో వర్క్ చేస్తూ ఉంటుంది. రేపటి కోసం ప్రాణాలకు తెగించి కాంప్లెక్స్‌లో చేరుతుంది. అక్కడ గర్భిణీలకు సంరక్షకురాలిగా వ్యవహరిస్తూ ఉంటుంది. తొలుత దీపికాకు ఫేవర్‌గా ఉండి.. ఆ తర్వాత విలన్ గ్యాంగ్‌కు పట్టించి.. చివరకు ఆమెను ప్రాణాలతో కాపాడి.. శంభాలకు పంపిస్తుంది. చిన్న పాత్రే అయినా బాగా ఆకట్టుకుంది ఈ యాక్టర్. ఆ నటి ఎవరంటే.. కావ్య రామచంద్రన్. ఆమె చాలా సాదాసీదాగా కనిపిస్తున్న ఈ అమ్మాయి మల్టీ టాలెంటర్. నటి, విద్యావేత్త, థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు స్విమ్మర్ కూడా. ఆమె కేరళలో పుట్టినప్పటికీ.. ప్రాథమిక విద్య వరకే అక్కడ చదివింది. ఆ తర్వాత ఆమె కుటుంబం చెన్నైకి షిఫ్ట్ అయ్యింది.

స్టెల్లా మేరీ కళాశాలలో అర్థశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది కావ్య. ఆమె కేవలం నటి మాత్రమే కాదు..ఎన్జీవోతో కలిసి వర్క్ చేసింది. ఆమె అక్క శృతి రామచంద్రన్ (డియర్ కామ్రేడ్) కూడా నటే. ముంబైలోని ‘టీచ్ ఫర్ ఇండియా’లో ఫెలోగా చేరడానికి ముందు ఆమె బెంగళూరులోని ఒక ఎన్జీవోలో ఏడాదిపాటు పనిచేసింది. అలాగే సుఖా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనే ఎన్జీవోకి సహ వ్యవస్థాపకురాలు కూడా. తర్వాత మోడల్ గా మారి క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్, తనిష్క్, క్యారెట్ లేన్, మింత్ర, కర్లాన్, మిల్కీ బికిస్ వంటి యాడ్స్ చేసింది. ప్రతి రోజూ టీవీలో వస్తున్న బ్రూ యాడ్‌లో నటించింది ఈ బ్యూటీనే. అలాగే మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా ఆడిపాడింది. దీంతో ఆమెకు కల్కిలో యాక్ట్ చేసే అవకాశం కలిగింది. ఈ మూవీతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Kavya Ramachandran (@kavyaramachandran_)