iDreamPost
android-app
ios-app

కల్కిలో అమితాబ్ డూప్‌గా చేసిందెవరో తెలుసా? తాజాగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టాడు..

  • Published Aug 30, 2024 | 2:10 PM Updated Updated Aug 30, 2024 | 2:10 PM

నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన సంగతి విదితమే. బిగ్ బీ, డార్లింగ్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి. ఈ ఫైట్ సీన్లలో అమితాబ్ కు డూప్ గా నటించిన యాక్టర్ ఎవరో తెలుసా..? తాజాగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టాడు

నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన సంగతి విదితమే. బిగ్ బీ, డార్లింగ్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి. ఈ ఫైట్ సీన్లలో అమితాబ్ కు డూప్ గా నటించిన యాక్టర్ ఎవరో తెలుసా..? తాజాగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టాడు

  • Published Aug 30, 2024 | 2:10 PMUpdated Aug 30, 2024 | 2:10 PM
కల్కిలో అమితాబ్ డూప్‌గా చేసిందెవరో తెలుసా? తాజాగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టాడు..

గ్లోబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ కల్కి 2898 ఏడీ. జూన్‌ 27న విడుదలై ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాకు మెయిన్ ఫిల్లర్స్ అయ్యారు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్. రూ. 600 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ కాసుల సునామీ కురిపించింది. రూ. 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన చిత్రం హయ్యెస్ట్ రేటింగ్‌తో దూసుకెళుతుంది. ఇదిలా ఉంటే.. ఇందులో అమితాబ్ బచ్చన్, ప్రభాస్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయిన సంగతి విదితమే. అయితే ఈ సన్నివేశాల్లో బిగ్ బి బదులు డూప్ యాక్ట్ చేశాడు. అతడు ఎవరంటే…సునీల్ కుమార్. జమ్ముకాశ్మీర్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్. తాజాగా వచ్చిన ఓ మూవీతో మరోసారి వార్తల్లో నిలిచాడు.

రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ హారర్ మూవీ స్త్రీ. స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసును షేక్ చేసేస్తుంది. ఇప్పటి వరకు 600 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి.. ఇంకా రన్నింగ్ అవుతుంది. ఇందులో సర్కట పాత్రలో భయపెడుతుంది. ఈ పాత్రను పోషించి.. భయపెట్టాడు సునీల్ కుమార్. ఈ మూవీ సక్సెస్ కొట్టడంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. కల్కిలో అమితాబ్ డూప్‌గా చేశానని చెప్పాడు. జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న తాను అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టానని చెప్పారు. తన హైట్ వల్లే తనకు ఛాన్సులు వస్తున్నాయని తెలిపారు. 7.7 అడుగుల ఎత్తు ఉండటం వల్లే ప్రభాస్ కల్కిలో అమితాబ్‌కు డూప్‌గా పనిచేశానని చెప్పారు. తనపై యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించారన్నారు.

Amitabh bachchan dupe details in kalki

‘మా కుటుంబం మొత్తం అమితాబ్ బచ్చన్‌కు బిగ్ ఫ్యాన్స్. ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్‌ డూప్‌గా పనిచేశా. ఎత్తు కారణంగానే ఆయనకు డూప్‌గా వర్క్‌ చేసే అవకాశం నాకు వచ్చింది. ‘కల్కి’ సెట్‌లోకి అడుగు పెట్టిన తొలి క్షణాలను ఎప్పటికీ మర్చిపోను. ఆ సమయంలో ప్రభాస్ – అమితాబ్‌ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ‌ ఎంతో సరదాగా సాగింది. నాపై ఎన్నో స్టంట్స్‌ చిత్రీకరించారు. ఫైట్స్‌ కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో అమితాబ్‌ నా వద్దకు వచ్చి మాట్లాడారు. నా పక్కన నిల్చొని కెమెరామెన్‌తో చెప్పి ఫొటో తీయించుకున్నారు. అలాగే నేనే చాలా ఎత్తని అంటుంటారు. ఎట్టకేలకు నా కన్నా ఎత్తైన వ్యక్తిని కలిశా నాతో చమత్కరించారు’ అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే హిందీ బిగ్ బాస్ 18కి ఆఫర్ వచ్చిందని తెలిపాడు. ఇక కల్కి-2లో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibom