iDreamPost
android-app
ios-app

‘సలార్’ పోస్ట్ పోన్.. ప్రభాస్ ఫ్యాన్స్ కి మరింత నిరాశ!

  • Published Sep 13, 2023 | 11:00 AM Updated Updated Sep 13, 2023 | 11:00 AM
  • Published Sep 13, 2023 | 11:00 AMUpdated Sep 13, 2023 | 11:00 AM
‘సలార్’ పోస్ట్ పోన్.. ప్రభాస్ ఫ్యాన్స్ కి మరింత నిరాశ!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది నటవారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు సోదరుడి కొడుకు ప్రభాస్ ‘ఈశ్వర్’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. మాస్ యాక్షన్ తో తొలిచిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచాడు ప్రభాస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ చిత్రంతో ప్రభాస్ స్టార్ డమ్ మరింత పెరిగిపోయింది. ఇక బాహుబలి సీరీస్ తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు కోట్లలో కలెక్షన్లు రాబడుతున్నాయి. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, యశ్ కాంబినేషన్ లో వచ్చిన ‘కేజీఎఫ్’ సీరిస్ పాన్ ఇండియా లెవెల్లో ఓ ట్రెండ్ సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘సలార్’ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్ కి భారీ స్పందన రావడంతో అంచనాలు కూడా బాగా పెరిగిపోయాయి. తాజాగా సలార్ రిలీజ్ వాయిదాపై అధికారిక ప్రకటన చేశారు చిత్ర యూనిట్. వివరాల్లోకి వెళితే..

ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న ‘సలార్’ మూవీ రెండు భాగాలుగా వస్తున్నట్లు.. సెప్టెంబర్ 28న మొదటి భాగం రిలీజ్ చేయబోతున్నట్లు గతంలో చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఫ్యాన్స్ ‘సలార్’ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ ఈ సినిమా రిలీజ్ పై సందిగ్ధత ఏర్పడింది. సీజీ వర్క్ విషయంలో ఔట్ పుట్ బాగాలేదని.. డైరెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో చివరి నిమిషంలో మూవీ వాయిదా పడింది. ఈ మూవీ రిలీజ్ పై గత వారం పదిరోజుల నుంచి రక రకాలు వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో ప్రభాస్‌ ఫ్యాన్స్ కి ‘సలార్‌’ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. తాజాగా ‘సలార్’ వాయిదా అధికారికంగా ప్రకటించింది నిర్మాణ సంస్థ.

‘సలార్ మూవీపై మీరు చూపిస్తున్న ఆదరణ, సపోర్ట్ కి అభినందనలు.. అనుకోని కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ అయిన సెప్టెంబర్ 28వ తేదీని వాయిదా వేస్తున్నాం. ఈ మూవీ మరింత అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియస్ అందించాలనేదే మా అభిమతం. అందుకుకు మేం కట్టుబడి ఉన్నాం.. ఈ కారణంతోనే వాయిదా వేయడానికి నిశ్చయించుకున్నాం. కాబట్టి ఈ నిర్ణయాన్ని అర్ధం చేసుకోగలరు.. ఈ మూవీని హయ్యేస్ట్ స్టండర్డ్స్ లో అందించడానికి అవిశ్రాంతంగా చిత్ర యూనిట్ కృషి చేస్తుంది’ అంటూ అఫిషియల్ గా ట్వీట్ చేశారు చిత్రయూనిట్. ఇదిలా ఉంటే.. ఇటీవల రిలీజ్ అయిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు వరుసగా ఫ్లాపులు కావడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు ఫ్యాన్స్.

పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్ మూవీస్ పై భారీ అంచనాలు ఉంటున్నాయి. బాహుబలి సీరీస్ తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. కాకపోతే బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు వరుస పరాజయాలకు గురయ్యాయి. ఇలాంటి సమయంలో ‘కేజీఎఫ్’ తో సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ తీస్తున్న ‘సలార్’ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ గా నిలిచింది. ఈ మూవీలో ప్రభాస్ లుక్ పై ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.   ఇలాంటి సమయంలో సెప్టెంబర్ 28న రిలీజ్ వాయిదా పడటంతో మరోసారి నిరాశలోకి వెళ్లారు. మరో ట్విస్ట్ ఏంటేంటే.. చిత్ర యూనిట్ నెక్ట్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. మరి ఈ మూవీ నవంబర్ లో అయినా రిలీజ్ అవుతుందా? లేక సంక్రాంతి బరిలో నిలుస్తుందా అన్న ఆలోచనలో ఫ్యాన్స్ పడిపోయారు. ఏది ఏమైనా సలార్ తదుపరి రిలీజ్ డేట్ ప్రకటించేవరకు ఎదురచూడాల్సిన పరిస్థితి ఫ్యాన్స్ కి ఏర్పడింది. మరి ఈ రిలీజ్ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss