iDreamPost
android-app
ios-app

డైరెక్టర్ స్థానంలో నిర్మాత పేరు! డెవిల్ వెనుక అసలేం జరుగుతోంది?

  • Author ajaykrishna Published - 03:24 PM, Wed - 13 September 23
  • Author ajaykrishna Published - 03:24 PM, Wed - 13 September 23
డైరెక్టర్ స్థానంలో నిర్మాత పేరు! డెవిల్ వెనుక అసలేం జరుగుతోంది?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘డెవిల్’ అనే పీరియాడిక్ స్పై థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇటీవల హీరోయిన్ సంయుక్త మీనన్ బర్త్ డే సందర్బంగా ఆమెకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్.. పోస్టర్ లో సంయుక్త అంతా బాగానే ఉంది. కానీ.. కింద టైటిల్స్ దగ్గరికి వెళ్తే.. పెద్ద కన్ఫ్యూషన్ మొదలైంది. అదేంటంటే.. డైరెక్టర్ ప్లేస్ లో నిర్మాత పేరే కనిపించడం షాకింగ్ విషయం. పోస్టర్ పై ‘ఎ ఫిల్మ్ బై అభిషేక్ పిక్చర్స్’ అని రాసి ఉంది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి డెవిల్ పై పడింది. అలాగే ఎందుకు నిర్మాత పేరు డైరెక్టర్ స్థానంలో వేశారు? అనే సందేహం మొదలైంది.

ఆ వివరాల్లోకి వెళ్తే.. ముందుగా ‘బాబు బాగా బిజీ’ అనే సినిమా తీసిన నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ మూవీ అనౌన్స్ అయ్యింది. కళ్యాణ్ రామ్ హీరోగా డెవిల్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు.. దర్శకుడుగా నవీన్ పేరు.. దర్శకత్వ పర్యవేక్షణగా అభిషేక్ పిక్చర్స్ పేరుంది. ఈ సినిమాకు కథా రచయితగా శ్రీకాంత్ విస్సా, డైరెక్టర్ గా నవీన్ మేడారంలతో సినిమా స్టార్ట్ అయ్యింది. కథతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా ఇద్దరు కలిసి చూసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో గానీ కొద్దిరోజులకు స్క్రీన్ ప్లే, డైరెక్టర్ గా నవీన్ పేరు వేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు స్క్రీన్ ప్లే కూడా పోయి.. కేవలం డైరెక్టర్ గా నవీన్ పేరు వేశారు. ఇప్పుడు డైరెక్టర్ గా కూడా పోయి నిర్మాతనే డైరెక్టర్ అయ్యాడు.

దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఆడియన్స్ లో కూడా అసలు డెవిల్ కి డైరెక్టర్ ఎవరు? అనే డౌట్ క్రియేట్ అయ్యింది. నవీన్ మేడారం డైరెక్టర్ గా మొదలైన డెవిల్ మూవీ.. ఇప్పుడు అభిషేక్ పిక్చర్స్ ఫిల్మ్ అని రావడం గమనార్హం. కొత్త పోస్టర్ పై డైరెక్టర్ పేరు లేకపోవడంతో.. అటు డైరెక్టర్ నవీన్ కి, ఇటు నిర్మాత అభిషేక్ కి మధ్య విభేదాలు ఏమైనా తలెత్తాయా? అనే అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి నవీన్ మొదటి సినిమా బాబు బాగా బిజీ కూడా.. అభిషేక్ పిక్చర్స్ లోనే చేశాడు. మరి డెవిల్ మూవీ విషయంలో ఏం జరిగిందో తెలియాల్సి ఉంది. ఈ విషయంపై త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి. మరి డెవిల్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss