iDreamPost
iDreamPost
బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేత ఎవరన్నది తేలిపోనుంది. శనివారంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ముగుస్తుండగా విజేత కోసం నిర్వహించిన అఫీషియల్ ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. అంటే టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోయినట్లే. మే 21న సాయంత్రం 6 నుంచి ఫినాలే స్ట్రీమింగ్ కానుంది. మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ టైటిల్ కోసం నువ్వా నేనా అంటూ రచ్చరచ్చ చేశారు. ఇంతకీ విన్నర్ ఎవరు? బిందు మాధవి?
బిగ్ బాస్ తెలుగు ఐదు సీజన్లలో మహిళా కంటెస్టెంట్ విజేత కాలేదు. తొలి సీజన్‌లో హరితేజ పోటీపడినా శివ బాలాజీ గెల్చుకున్నాడు. రెండో సీజన్‌లో సింగర్ గీతా మాధురి చివరి వరకు పోటీపడినా కౌశల్ టైటిల్ ను ఎగరేసుకుపోయాడు. మూడో సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్, నాలుగో సీజన్‌లో అభిజిత్, ఐదో సీజన్‌లో సన్నీ విన్నర్లయ్యారు.
ఈ ట్రెండ్ ఈసారి మారడం ఖాయంగా కనిపిస్తోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ కు మహిళా కంటెస్టెంట్ విజేత కావడం పక్కా.
బిగ్ బాస్ నాన్ స్టాప్ 17 మంది కంటెస్టెంట్స్ మొదలైంది. గ్రాండ్ ఫినాలే చివరి వారంలో ఏడుగురు మాత్రమే మిగిలారు. బిందు మాధవి, అఖిల్, యాంకర్ శివ, మిత్రా శర్మ , అరియానా గ్లోరి, బాబా భాస్కర్ , అనీల్ రాథోడ్ మిగిలారు. మిత్రా శర్మ కాస్త పోటీ ఇచ్చినా, అరియానాకు ఫ్యాన్స్ ఫోలోయింగ్ ఉన్నా, అఖిల్ సార్ధక్, బిందు మాధవిల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.
నిజానికి బిందు మాధవి చాలా ఏమోషనల్. అఖిల్ కు ఎలా గేమ్ ఆడాలో బాగానే తెలుసు. చాలాసార్లు బిందు మాధవిని రెచ్చగొట్టినా ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఒకరి మీద మరొకరు అధిపత్యం కోసం ట్రైచేశారు. చివరికి వచ్చేసరికి బిందు మాధవికి ఎడ్చ్ వచ్చింది. అఖిల్ కంటే బిందు ఎక్కువ ఓట్లు రాబట్టడంతో ఆమె టైటిల్ విన్నర్ కానుంది.
సోషల్ మీడియాలో అఖిల్ కంటే బిందుమాధవి ఎక్కువగా క్రేజ్ వస్తోంది. ఇన్ స్టాలో ఆమెకు గత రెండు మూడు నెలల్లో పెరిగిన ఫాలోవర్స్ బాగా పెరిగారు. ఆమె 1 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను అందుకోనుంది. బిగ్ బాస్ లోకి రాకముందు కు ఆమెకున్న ఫాలోవర్స్ 4 లక్షలే. 90 రోజుల్లోనే 8 లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం అంటే మాటలుకాదు. అది ఆమెకున్న క్రేజ్.
అఖిల్ కు మాత్రం పెద్దగా అభిమానులు పెరగలేదు. వెబ్ సైట్లు, మీడియా సంస్థల ఆన్ లైన్ పోల్స్ లోనూ మాధవి టాప్ ప్లేస్. అఖిల్ సార్ధక్ ది సెకండ్ ప్లేస్.