iDreamPost
android-app
ios-app

అఖిల్ అక్కినేనికి కాబోయే వైఫ్ .. జైనబ్ బ్యాక్గ్రౌండ్ ఇదే

  • Published Nov 27, 2024 | 6:37 PM Updated Updated Nov 27, 2024 | 6:37 PM

కొన్నేళ్ల క్రితం అఖిల్ పెళ్లి బ్రేక్ అయిన విషయం తెలిసిందే. అందుకే ఈసారి ఎలాంటి హడావిడి లేకుండా ఇద్దరు పిల్లల వివాహానికి సంబంధించిన వార్తను.. సైలెంట్ గా అనౌన్స్ చేశారు నాగార్జున. ఇక అఖిల్ , జైనబ్ పిక్ బయటకు రావడంతో.. ఈ అమ్మడి గురించి ఆరా తీయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. ఇంతకీ ఈ జైనబ్ ఎవరంటే..

కొన్నేళ్ల క్రితం అఖిల్ పెళ్లి బ్రేక్ అయిన విషయం తెలిసిందే. అందుకే ఈసారి ఎలాంటి హడావిడి లేకుండా ఇద్దరు పిల్లల వివాహానికి సంబంధించిన వార్తను.. సైలెంట్ గా అనౌన్స్ చేశారు నాగార్జున. ఇక అఖిల్ , జైనబ్ పిక్ బయటకు రావడంతో.. ఈ అమ్మడి గురించి ఆరా తీయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. ఇంతకీ ఈ జైనబ్ ఎవరంటే..

  • Published Nov 27, 2024 | 6:37 PMUpdated Nov 27, 2024 | 6:37 PM
అఖిల్ అక్కినేనికి  కాబోయే వైఫ్ .. జైనబ్ బ్యాక్గ్రౌండ్ ఇదే

అక్కినేని వారి ఇంట మరో వారం రోజుల్లో పెళ్లి సందడి మొదలవుతుంది. అభిమానులంతా ఎప్పుడెప్పుడు ఈ జంటను చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఈలోపే కింగ్ నాగ్ మరొక శుభవార్తను ప్రకటించారు. నిన్నటినుంచి సోషల్ మీడియాలో ఆ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అదే అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ పిక్. అఖిల్ కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అందరికి తెలియజేశారు నాగార్జున. కనీసం ఇప్పటివరకు లీకుల రూపంలో కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో.. ఇలా సడెన్ గా వారిద్దరి ఫోటో చూసి.. స్వీట్ షాక్ లా ఫీల్ అయ్యారు నెటిజన్లు. కొన్నేళ్ల క్రితం అఖిల్ పెళ్లి బ్రేక్ అయిన విషయం తెలిసిందే. అందుకే ఈసారి ఎలాంటి హడావిడి లేకుండా ఇద్దరు పిల్లల వివాహానికి సంబంధించిన వార్తను.. సైలెంట్ గా అనౌన్స్ చేశారు నాగార్జున. ఇక అఖిల్ , జైనబ్ పిక్ బయటకు రావడంతో.. ఈ అమ్మడి గురించి ఆరా తీయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. ఇంతకీ ఈ జైనబ్ ఎవరంటే..

ఆమె రావ్డ్జీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో పేరుగాంచిన పారిశ్రామికవేత్త జుల్ఫీ రావ్డ్జీ కుమార్తె. ఆమె సోదరుడు జైన్ రావ్డ్జీ ZR రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక జైనబ్ విషయానికొస్తే ఆమె ఒక ఓ టాలెంటెడ్ ఆర్టిస్ట్ , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ . దుబాయ్ , లండన్ లో ఆర్టిస్ట్ గా ఆమె మంచి పేరు సంపాదించుకుంది. హైదరాబాద్ లో జరిగిన రిఫ్లెక్షన్స్ తో పాటు.. అనేక ఎగ్జిబిషన్స్ లో ఆమె అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ ను ప్రదర్శించారట. జైనబ్ పుట్టి పెరిగింది హైదరాబాద్ లో అయినా ప్రస్తుతం ఆమె ముంబైలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఆమె తండ్రి జుల్ఫీ రావ్డ్జీ గురించి అనేక కథనాలు బయటకు వస్తున్నాయి. రాజకీయ నాయకులు , సినీ ప్రముఖులతో ఆయనకు దగ్గర సాన్నిహిత్యం ఉన్నట్లు సమాచారం. ఇక జుల్ఫీ రావ్డ్జీ , అక్కినేని నాగార్జునకు మధ్య గత కొన్నేళ్లుగా మంచి స్నేహ బంధం ఉందట. ఇక అఖిల్ హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న సమయంలో.. జైనబ్ తో పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతుందన్నట్లు తెలుస్తుంది. గత రెండేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమ బంధం కొనసాగుతుందట. ఇక ఇప్పుడు ఇరు కుటుంబాల అంగీకారంతో అది పెళ్లి బంధంగా మారబోతుంది. చాలా కొద్దిమంది స్నేహితులు , సన్నిహితులు , బందు మిత్రుల సమక్షంలో అఖిల్-జైనబ్ నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం దానికి సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాము.

ఏదేమైనా ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ నుంచి కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న క్రమంలో .. సడెన్ గా ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేసి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు అఖిల్. ఓ వైపు నాగచైతన్య పెళ్లి.. మరోవైపు అఖిల్ నిశ్చితార్థం అక్కినేని అభిమానులు ఈ రెండు వార్తలతో హ్యాపీ హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతానికైతే అఖిల్ పెళ్లి డేట్ ను అనౌన్స్ చేయలేదు. మరి త్వరలో అనౌన్స్ చేస్తారో.. లేదంటే డైరెక్ట్ గా పెళ్లి ఫోటోలు షేర్ చేసి మరోసారి సర్ప్రైజ్ చేస్తారో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş