iDreamPost
android-app
ios-app

రిలీజై ఏడాదవుతున్నా.. ఇంకా OTTలోకి రాని టాలీవుడ్‌ స్టార్‌ హీరో మూవీ

  • Published Apr 28, 2024 | 3:45 PM Updated Updated Apr 28, 2024 | 3:45 PM

Akhil Agent Movie: ఈ మధ్య కాలంలో థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా ఓటీటీల్లో విడుదలవుతోంది. కానీ ఓ టాలీవుడ్‌ స్టార్‌ హీరో సినిమా రిలీజై ఏడాది అయినా.. ఇంకా ఓటీటీలోకి రాలేదు. ఆ వివరాలు..

Akhil Agent Movie: ఈ మధ్య కాలంలో థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా ఓటీటీల్లో విడుదలవుతోంది. కానీ ఓ టాలీవుడ్‌ స్టార్‌ హీరో సినిమా రిలీజై ఏడాది అయినా.. ఇంకా ఓటీటీలోకి రాలేదు. ఆ వివరాలు..

  • Published Apr 28, 2024 | 3:45 PMUpdated Apr 28, 2024 | 3:45 PM
రిలీజై ఏడాదవుతున్నా.. ఇంకా OTTలోకి రాని టాలీవుడ్‌ స్టార్‌ హీరో మూవీ

ఇప్పుడంతా ఓటీటీలదే హవా. ఎంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా అయినా సరే.. బాక్సాఫీస్‌ వద్ద ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసిన చిత్రమైనా సరే.. ఓటీటీల్లోకి రావాల్సిందే. విడుదలైన ప్రతి సినిమా నాలుగు వారాల తర్వాత.. ఓటీటీల్లో విడుదలవుతుంది. ఇక కొన్ని చిత్రాలైతే.. నెల రోజులు కూడా పూర్తి కాకముందే.. ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్నాయి. ఇక కొన్ని చిత్రాలైతే కేవలం ఓటీటీల్లోనే రిలీజై సత్తా చాటుతున్నాయి. అయితే టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్‌ హీరో సినిమా మాత్రం విడుదలై ఏడాది కావొస్తున్నా ఇంకా ఓటీటీలో విడుదల కాలేదు. ఇంతకు ఆ సినిమా ఏది.. ఎందుకు విడదల కాలేదు అంటే..

అక్కినేని వారసుడు, నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన స్పై యాక్షన్ డ్రామా ‘ఏజెంట్‌’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న మేర రాణించలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్‌ సినిమా.. ప్రేక్షకులను మాత్రం ఆ రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి ఏడాది అవుతున్నా.. ఓటీటీల్లోకి మాత్రం ఇంకా రాలేదు. అయితే ఏజెంట్‌ సినిమాను మే 19, 2023న ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లుగా సోనీ లివ్‌ ప్రకటించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 29, 2023కి స్ట్రీమింగ్‌ను వాయిదా వేసింది. కానీ అప్పుడు కూడా ఓటీటీలో విడుదల కాలేదు.

అయితే వైజాగ్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగానే ఏజెంట్‌ ఓటీటీ రిలీజ్‌ వాయిదా, ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. అది పూర్తయ్యే వరకూ ఏజెంట్ ఓటీటీలోకి వచ్చే అవకాశమే లేదు. ఇక ఈ సినిమాలో మమ్ముట్టి, సాక్షి వైద్య, డినో మోరియాతో కీలక పాత్రల్లో నటించారు. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందించారు. రామబ్రహ్మం సుంకర చిత్రాన్ని నిర్మించారు. హిప్ హాప్ తమిజా ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు.

ఇక సినిమాల విషయానికి వస్తే అఖిల్‌ ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా తెరకెక్కనుందట. ఈ ప్రాజెక్టును గతేడాదే ప్రారంభించాలని అనుకున్నా వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది. అఖిల్‌ ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్టు కొట్టాలని పని చేస్తున్నాడు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibommatbet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap