అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి లగ్జరీ విల్లా!

  • Author Soma Sekhar Published - 05:41 PM, Sun - 20 August 23
  • Author Soma Sekhar Published - 05:41 PM, Sun - 20 August 23
అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి లగ్జరీ విల్లా!

సాధారణంగా వ్యాపార వేత్తలు, సెలబ్రిటీలు తమ ప్రాపర్టీస్ ను బ్యాంకుల్లో పెట్టి లోన్స్ తీసుకోవడం సహజమే. ఆ తర్వాత ఆ లోన్స్ ను కట్టి వారి ఆస్తులను వారు తీసుకుంటారు. కానీ ఓ స్టార్ హీరో బ్యాంకుకు కట్టాల్సిన డబ్బు ఎగ్గొట్టడంతో.. అతడి ఖరీదైన విల్లాను వేలం వేయడానికి సిద్దమైంది సదరు బ్యాంక్. ఈ విషయం పేపర్లో వచ్చేదాక ఎవరికీ తెలీదు. మరి బ్యాంకుకు అప్పు ఎగ్గొట్టిన ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

బాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత ఓ సూపర్ హిట్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆ సినిమానే ‘గదర్ 2’. స్టార్ హీరో సన్నీ డియోల్ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాడు. అతడి కెరీర్ ముగిసిపోయింది అనుకున్న క్రమంలో గదర్ 2 మూవీ అతడికి లైఫ్ ఇచ్చింది. ఇక ఈ మూవీ హిట్ అయిన సంతోషాన్ని అతడు అనుభవించకుండా అయినట్లుంది. దానికి కారణం కోట్ల రూపాయల అప్పు బ్యాంకులో రుణంగా తీసుకుని ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం అతడి ఖరీదైన విల్లా వేలానికి రావడంతో బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. ముంబై జుహు ఏరియాలో గాంధీగ్రామ్ రోడ్ లో సన్నీ డియోల్ కు ఒక విలాసవంతమైన విల్లా ఉంది. దీనిని బ్యాంక్ ఆఫ్ బరోడా లో తాకట్టు పెట్టి రూ. 56 కోట్ల లోన్ తీసుకున్నాడట సన్నీ డియోల్. కానీ తీసుకున్న అప్పును చెల్లించడంలో మెుహం తిప్పేశాడట ఇతడు. అతడికి ఎన్ని సార్లు బ్యాంక్ నోటీసులు పంపినా కానీ స్పందించలేదట. దీంతో ఆదివారం (ఆగస్టు 20)న ఓ ప్రముఖ పేపర్ లో సన్నీ డియోల్ కు సంబంధించిన విల్లాను వేలం వేస్తున్నట్లు సదరు బ్యాంకు ప్రకటన ఇచ్చింది. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో సన్నీ డియోల్ గురించి చర్చ మెుదలైంది.

కాగా.. ధర్మేంద్ర వారసుడిగా అతడికి చాలా ఆస్తులు ఉన్నాయి. ఇక ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంటున్న ఇతడు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించాడు. అలాంటి హీరో 56 కోట్ల అప్పు ఎగ్గొట్టడం ఏంటి? అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే అతడికి ఈ అప్పు తీర్చడం పెద్ద సమస్య కాదని, కానీ అతడు ఎందుకు ఈ అప్పు తీర్చలేకపోయాడో.. అర్దం కాట్లేదని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వార్తలపై సన్నీ డియోల్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి.

ఇదికూడా చదవండి: ‘ఖుషి’ మూవీ రెమ్యూనరేషన్ల లిస్ట్.. వామ్మో అంత తీసుకున్నారా?

Show comments