iDreamPost
android-app
ios-app

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 592 జాబ్స్.. రాత పరీక్ష లేదు.. ఇప్పుడే అప్లై చేసుకోండి

Bank of Baroda Recruitment 2024: బ్యాంక్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే బ్యాంక్ ఆప్ బరోడా నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఏకంగా 592 పోస్టులు భర్తీకానున్నాయి.

Bank of Baroda Recruitment 2024: బ్యాంక్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే బ్యాంక్ ఆప్ బరోడా నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఏకంగా 592 పోస్టులు భర్తీకానున్నాయి.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 592 జాబ్స్.. రాత పరీక్ష లేదు.. ఇప్పుడే అప్లై చేసుకోండి

బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలని యూత్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బ్యాంక్ జాబ్ లక్ష్యంగా ప్రిపేర్ అవుతుంటారు. కోచింగ్ తీసుకుని పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగిస్తారు. బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటారు. హాలిడేస్, మంచి జీతం, ఆహ్లాదకరమైన వాతావరణంలో విధుల కారణంగా బ్యాంక్ జాబ్స్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇటీవల భారీ సంఖ్యలో బ్యాంకు ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. పలు బ్యాంకులు జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నాయి. సీరియస్ గా ట్రై చేస్తే మీరు కలలు కన్న బ్యాంక్ జాబ్ ను మీ సొంతం చేసుకోవచ్చు. మీరు కూడా బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నట్లైతే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా నిరుద్యోగులకు తీపికబురందించింది.

బీఓబీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 592 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ 140, డిజిటల్ గ్రూప్ 139, రిసీవబుల్ మేనేజ్ మెంట్ 202, ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ 31, కార్పోరేట్, క్రెడిట్ విభాగం 79, ఫైనాన్స్ 1, ఈ పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ కానున్నాయి. దేశవ్యాప్తంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శాఖల్లోని వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఖాళీ పోస్టుల్లో రిలేషన్‌షిప్ మేనేజర్, జోనల్ లీడ్ మేనేజర్, బిజినెస్ మేనేజర్, డేటా ఇంజినీర్స్, టెస్టింగ్ స్పెషలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, జోనల్ రిసీవబుల్స్ మేనేజర్, రీజనల్ రిసీవబుల్స్ మేనేజర్, ఏరియా రిసీవబుల్స్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్, సీనియర్ క్లౌడ్ ఇంజినీర్, ప్రొడక్ట్ మేనేజర్ తదితర పోస్టులు ఉన్నాయి.

ఈ జాబ్స్ కోసం పోటీపడే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 22 ఏళ్ల నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష రాయకుండానే బ్యాంక్ జాబ్ మీ సొంతం చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్య్వూ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్‌ 19వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు www.bankofbaroda.in వెబ్‌సైట్‌ ను సందర్శించాల్సి ఉంటుంది. బ్యాంక్ జాబ్ లక్ష్యంగా పెట్టుకున్న వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఈ పోస్టులకు ఇప్పుడే అప్లై చేసుకోండి.