iDreamPost
android-app
ios-app

FDలపై వడ్డీ రేట్లు పెంచిన ఫేమస్ బ్యాంక్స్.. ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?

  • Published Nov 04, 2024 | 12:22 PM Updated Updated Nov 04, 2024 | 12:22 PM

Fixed Deposits: FD లు చాలా సురక్షితం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా FD లపై మంచి లాభాలు ఇస్తున్నాయి.

Fixed Deposits: FD లు చాలా సురక్షితం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా FD లపై మంచి లాభాలు ఇస్తున్నాయి.

FDలపై వడ్డీ రేట్లు పెంచిన ఫేమస్ బ్యాంక్స్.. ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?

బ్యాంకులు అందించే ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్స్ (ఎఫ్ డీలు) చాలా సురక్షితమైన పెట్టుబడి మార్గాలు. అందుకే ఎక్కువ మంది తమ డబ్బును వాటిలో దాచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. పైగా బ్యాంకుల్లో డబ్బులకు సూపర్ సేఫ్టీ ఉంటుంది. మెచ్యురిటీ తర్వాత వడ్డీతో కలిపి ఎక్కువ లాభాలు పొందుతారు. FD లపై నెలవారీ, త్రైమాసికం, వార్షిక పద్ధతులతో వడ్డీని పొందవచ్చు. అలాగే మెచ్యురిటీ సమయంలో అసలుతో కలిసి తీసుకుకోవచ్చు. చాలా మంది కూడా బాగా పేరున్న ఫేమస్ బ్యాంక్స్ లో FD చేయాలని అనుకుంటూ ఉంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఫేమస్ బ్యాంక్స్. వీటిల్లో డబ్బులు దాచుకోవడం చాలా సేఫ్. అందుకే ఎక్కువ మంది ఈ బ్యాంకులలో FD చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ రెండు బ్యాంక్ లలో ఎఫ్ డీలపై మంచి వడ్డీ రేట్లు అమలవుతున్నాయి. అంతే కాదండోయ్ గ్యారెంటీ రిటర్న్ లతో పాటు ఆదాయపు పన్నుచట్టంలోని సెక్షన్ 80 సి కింద టాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇక వీటిలో మన డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుందో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి ఫేమస్ బ్యాంక్ గా దూసుకుపోతుంది. ఈ బ్యాంక్ తన ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీమ్స్ పై కామన్ సిటీజన్స్ కి 6.50 పర్సెంట్ వడ్డీని ఇస్తుంది. ఇక సీనియర్ సిటిజన్లకు అయితే బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. వారికి ఏకంగా 7.50 పర్సెంట్ వడ్డీరేటును అందజేస్తోంది. ఇంకా అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా తన కస్టమర్లకు మంచి వడ్డీ రేటుని ఇస్తుంది. కామన్ సిటీజనులకు 6.50 పర్సెంట్ వడ్డీ రేటుని ఇస్తుంది. సీనియర్ సిటిజన్లకు అయితే 7.40 శాతం వడ్డీరేటును ఇస్తుంది. ఇక ఈ ఈ రెండు బ్యాంకులలో ఐదేళ్ల పాటు FD చేస్తే ఎన్ని మన డబ్బుపై ఎంత లాభం వస్తుందో తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంకులోని ఎఫ్ డీలలో ఐదేళ్లకి రూ.8 లక్షలను డిపాజిట్ చేస్తే మెచ్యురిటీ తర్వాత కామన్ సిటీజన్స్ రూ.11,04,336 డబ్బుని అందుకుంటారు. అంటే 3 లక్షల పైగా లాభం పొందవచ్చు. ఇక సినియర్ సిటిజన్లకు అయితే రూ.11,59,958 డబ్బులు తీసుకోవచ్చు. అంటే వీరికి 3 లక్షల 59 వేలకు పైగా లాభం వస్తుంది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా ఐదేళ్లకు రూ.8 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత కామన్ సిటీజన్ లు రూ.11,04,336 అందుకుంటారు. అంటే వీరికి కూడా 3 లక్షల పైగా లాభం వస్తుంది. ఇక అదే సీనియర్ సిటిజన్లకైతే రూ.11, 54, 279 వస్తాయి. వీరు 3 లక్షల 54 వేలకు పైగా లాభం పొందుతారు. ఇదీ సంగతి. ఇలా ఈ ఫేమస్ బ్యాంక్స్ లో FD లపై మనం ఏకంగా మూడు లక్షల పైగా వడ్డీని పొందవచ్చు. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక: ఈ సమాచారం పలువురు మర్కెట్ నిపుణులు తెలిపిన వివరాల మేరకు ఇవ్వడం జరిగింది. ఎక్కడైన పెట్టుబడులు పెట్టే ముందు ఆయా రంగాల నిపుణులను సంప్రదించడం ఉత్తమం.