iDreamPost
android-app
ios-app

లోన్ తీసుకుంటున్నారా? అయితే కచ్చితంగా ఈ పని చేయాల్సిందే? లేదంటే నష్టపోతారు!

  • Published Oct 23, 2024 | 6:17 PM Updated Updated Oct 23, 2024 | 6:17 PM

Bank Loan: హోమ్ లోన్ తీసుకున్నాక దాన్ని కట్టడం చాలా కష్టం అవుతుంది. మనకు ఏదైనా యాక్సిడెంట్ జరిగి పని చేసే స్థితిలో ఉండకపోవచ్చు.

Bank Loan: హోమ్ లోన్ తీసుకున్నాక దాన్ని కట్టడం చాలా కష్టం అవుతుంది. మనకు ఏదైనా యాక్సిడెంట్ జరిగి పని చేసే స్థితిలో ఉండకపోవచ్చు.

లోన్ తీసుకుంటున్నారా? అయితే కచ్చితంగా ఈ పని చేయాల్సిందే? లేదంటే నష్టపోతారు!

చాలా మంది కూడా చాలా రకాల లోన్లు తీసుకుంటారు. వ్యాపారం కోసమో, కార్ కొనడానికో లేదా ఇల్లు కొనేందుకో లోన్లు తీసుకుంటారు. అయితే అన్నిటికంటే కూడా ఎక్కువగా హోమ్ లోన్ తీసుకుంటారు చాలా మంది. సొంతగా ఇల్లు కట్టుకోవడం ప్రతి మధ్యతరగతి వ్యక్తి కల. ఆ కల సాకారం కావాలంటే వారికి ఈజీగా దొరికే మార్గం బ్యాంక్ లోన్. కాబట్టి అందువల్ల చాలా మంది కూడా బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చేస్తారు. లేదా కొత్త ఇల్లు కట్టుకుంటారు. కానీ ఆ లోన్ ని తిరిగి కట్టాలంటే చుక్కలు కనిపిస్తాయి. మనం సంపాదించే సంపాదనలో సగం అంతా బ్యాంక్ EMI లకే పోతుంది. మనం తీసుకునే లోన్ పై వడ్డీతో కలిపి రెట్టింపు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు తెలిపే విషయం గురించి తెలుసుకుంటే మనం చాలా సులభంగా బ్యాంక్ లోన్ భారం తగ్గించుకోవచ్చు.

హోమ్ లోన్ తీసుకుక కొన్ని సంన్నాదర్భాలలో దాన్ని కట్టడం చాలా కష్టం అవుతుంది. లేదా మనకు ఏదైనా యాక్సిడెంట్ జరిగి పని చేసే స్థితిలో ఉండకపోవచ్చు. లేదా ప్రమాదవశాత్తూ మనం మన ప్రాణాలు కోల్పోవచ్చు. ఆ టైమ్ లో మన లోన్ భారం ఖచ్చితంగా మన కుటుంబ వ్యక్తులపై పడుతుంది. వారు కట్టే పరిస్థితిలో ఉన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి రావొచ్చు. అప్పుడు మీరు ఎన్నో కలలతో కొనుకున్న ఇల్లు బ్యాంకు వారు సీజ్ చేయవచ్చు. దాంతో మీ కుటుంబ సభ్యులు రోడ్ మీద పడవచ్చు. అయితే అలాంటి పరిస్థితి రాకుండా లోన్ తీసుకునేటప్పుడు మీరు కచ్చితంగా ఒక పని చేయాలి.ఆ పని ఏంటి? దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

హోమ్ లోన్ అయినా ఏ లోన్ అయినా తీసుకునేటప్పుడు కచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం వల్ల లెక్కలేనన్ని బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ తీసుకోవడానికి పెద్ద ఖర్చు కూడా ఏమి ఉండదు. నెలకు వెయ్యి రూపాయలు లేదా అంతకన్నా తక్కువ కట్టుకుంటే చాలు మీ కుటుంబ భవిష్యత్తు బంగారు మయం అవుతుంది. 2 కోట్ల టర్మ్ ప్లాన్ తీసుకోవడం వలన మీకు ప్రమాదం జరిగినప్పుడు ఈ డబ్బులు మీ చేతికి వస్తాయి. ఒకవేళ మీరు లేకుంటే మీ కుటుంబానికి వస్తాయి. లోన్ కట్టలేని లేని పరిస్థితిలో ఉంటే ఈ 2 కోట్లు ఆ లోన్ ని తీర్చడంలో సాయపడతాయి. సపోజ్ మీ హోమ్ లోన్ 50 లక్షలు ఉందని అనుకుందాం. టర్మ్ ఇన్సూరెన్స్ లో వచ్చే 2 కోట్లలో 50 లక్షలు ఈ లోన్ కి పోయినా కూడా మీకు 1 కోటి 50 లక్షలు మిగులుతాయి. ఆ డబ్బుతో మీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటుంది. Bankbazaar వెబ్ సైటులో ఇలాంటి టర్మ్ ప్లాన్స్ ఇచ్చే కంపెనీలు చాలా ఉంటాయి. వాటిలో బెస్ట్ కంపెనీ ఏదో చూసుకొని దాని గురించి తెలుసుకొని మీరు ఈ ప్లాన్ తీసుకోవచ్చు. కాబట్టి లోన్ తీసుకునేటప్పుడు కచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా తీసుకోండి. ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.