Uppula Naresh
Uppula Naresh
అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు అధికమవుతుంది. దీంతో ప్రభుత్వాలు ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తునే ఉన్నాయి. ఇక ఇందులో భాగంగానే భారీ ఎత్తున ఫ్లై ఓవర్లు నిర్మిస్తూ ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్యను తగ్గిస్తున్నారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య ఉన్న చోట తెలంగాణ సర్కార్ పెద్ద పెద్ద ఫ్లై ఓవర్లు నిర్మించింది. కేబుల్ బ్రిడ్జిని సైతం నిర్మించి ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసింది. అయినా ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. ఇకపోతే.. హైదరాబాద్ మాధాపూర్ లోని కేబుల్ బ్రిడ్జిపై తాజాగా ఓ ఆటో బయలు దేరింది.
రోడ్డుపై రయ్యు మంటూ దూసుకెళ్తుంది. అయితే ఈ క్రమంలోనే ముందున్న రెండు ద్విచక్రవాహనాలను ఆటో డ్రైవర్ ఓవర్ టెక్ చేయాలనే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే ముందున్న వాహనాలను తప్పించే క్రమంలోనే ఆ ఆటో డ్రైవర్ సడెన్ టర్న్ చేయబోయాడు. ఇదే సమయంలో ప్రమాదవశాత్తు ఆ ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. వాహనదారులు అప్రమత్తమై ఆ ఆటో డ్రైవర్ ను రక్షించారు. ఈ ప్రమాదంలో ఆ ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి: వీడియో: వైష్ణవి సెలబ్రేషన్ వీడియో రిలీజ్! అదరగొట్టేసింది!