iDreamPost
android-app
ios-app

సోషల్ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్… కానీ ఆమె చేసిన ఒక్క పనితో

సోషల్ మీడియా పుణ్యమా అని ఇన్ స్టా, యూట్యూబ్ ద్వారా ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పుట్టుకొస్తున్నారు. రీల్స్, షాట్స్ చేస్తూ అనామకులు సైతం ఫేమస్ అయ్యారు. కానీ ఫేమ్ అయ్యాక.. చెత్త పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

సోషల్ మీడియా పుణ్యమా అని ఇన్ స్టా, యూట్యూబ్ ద్వారా ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పుట్టుకొస్తున్నారు. రీల్స్, షాట్స్ చేస్తూ అనామకులు సైతం ఫేమస్ అయ్యారు. కానీ ఫేమ్ అయ్యాక.. చెత్త పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

సోషల్ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్… కానీ ఆమె చేసిన ఒక్క పనితో

సెల్ ఫోన్ చూడటం, రీల్స్, షాట్స్ చూడటం సరదా.. అంతేనా వీడియోలు క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేయడం అదొక ఫన్, ఎంటర్ టైన్ మెంట్. సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ.. కొత్త కొత్త యాప్స్ మొబైల్ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. దీంతో డబ్బులు సంపాదించుకోవచ్చు అని తెలిసే సరికి.. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్లుగా .. వీడియో క్రియేట్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇటీవల కాలంల రీల్స్ పిచ్చి పరాకాష్టకు చేరిందన్న సంగతి విదితమే. ఏదో చేయాలన్న తపన, తోటి ఇన్ఫ్లుయెన్సర్లతో పోటీ, ఫాలోవర్స్‌ను పెంచుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఫేం అయ్యేందుకు వెనకా ముందు ఆలోచించకుండా ఏ పనులు పడితే ఆ పని చేస్తున్నారు.

ఇందులో అమ్మాయిలు మహా ముదుర్లు అయిపోయారు. ఓవర్ నైట్ స్టార్ గుర్తింపు వచ్చేందుకు పిచ్చి పనులు చేస్తూ చీవాట్లు తింటున్నారు. ఇదిగో ఈ ఫోటోలోని అమ్మాయి కూడా ఇదే చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురికావడమే కాదు పోలీసుల దృష్టిలో పడి.. వార్నింగ్ తీసుకుంది. ప్రముఖ యూట్యూబర్ సిమ్రాన్ యాదవ్ అనే మహిళ.. తన చేతుల్లో ఫిస్టల్ పట్టుకుని.. రోడ్డు మధ్యలో డ్యాన్స్ చేస్తోంది. ఇది ఓ హైవేపై చిత్రీకరించినట్లు తెలుస్తోంది. కాగా, అడ్వకేట్ కళ్యాణ్‌జీ చౌదరి అనే ఎక్స్ ఖాతాదారుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో సిమ్రాన్ భోజ్ పురి పాటకు చిందులేస్తూ.. కనిపిస్తోంది. రోడ్డు మధ్యలో డ్యాన్స్ చేస్తుండగా.. వెనుక నుండి కొంత మంది అలాగే చూస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. కాగా, దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు ఆ గ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అంత మంది జనాలు ఉండగా.. రోడ్డు మధ్యలో ఫిస్టల్ పట్టుకుని ఎందుకు చూపిస్తుంది అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. పెద్ద ఫాలోయింగ్ ఉన్న ఓ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వీడియోను షేర్ చేయడం సరైన చర్య కాదు అంటూ కామెంట్ చేశాడు. ఈ రీల్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నాడు. చాలా మంది పోలీసు అధికారులకు ట్యాగ్ చేయడంతో.. ఎట్టకేలకు  పోలీసులు ఈ ఘటనపై స్పందించారు.  దృష్టి సారించాలంటూ లక్నో పోలీసులను ఆదేశించారు యూపీ పోలీసులు. లక్నో పోలీసులు ఈ విషయంపై స్పందిస్తూ.. తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. సిమ్రాన్ యాదవ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు మరియు యూట్యూబ్‌లో 1.8 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.