iDreamPost
android-app
ios-app

దివ్య సూసైడ్ కేసు.. ఆరు నెలలుగా వేధింపులు.. వెలుగులోకి సంచలన నిజాలు!

మీర్ పేట్ లో ఆత్మహత్యకు పాల్పడిన దివ్య కేసులో సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. షాపు యజమాని ఆరు నెలల నుంచే నిత్య నరకం చూపించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు.

మీర్ పేట్ లో ఆత్మహత్యకు పాల్పడిన దివ్య కేసులో సంచలన నిజాలు వెలుగుచూస్తున్నాయి. షాపు యజమాని ఆరు నెలల నుంచే నిత్య నరకం చూపించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు.

దివ్య సూసైడ్ కేసు.. ఆరు నెలలుగా వేధింపులు.. వెలుగులోకి సంచలన నిజాలు!

హైదరాబాద్ నగరంలో యువతి సూసైడ్ కలకలం రేపుతోంది. కుటుంబానికి అండగా ఉండాలని భావించి ఉద్యోగం చేస్తున్న ఆ యువతి పాలిట ఉద్యోగం కల్పించిన వ్యక్తే కాలయముడయ్యాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ వ్యక్తి యువతిని చెరబట్టాలని చూశాడు. గత ఆరు నెలల నుంచి నిత్యం నరకం చూపిస్తూ లైంగికంగా వేధించసాగాడు. ఈ క్రమంలో నిన్న ఆ యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఇక అతడి చెర నుంచి బయటపడ్డ యువతి తీవ్ర మనస్థాపంతో దారుణ నిర్ణయం తీసుకుంది. షాపులో ఉన్న శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇక ఈమె సూసైడ్ కేసులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి.

దేవరకొండకు చెందిన దివ్య (18) మీర్పేట్ టీచర్స్ కాలనీలో ఉన్న ది బాబ్ సెలూన్ లో పనిచేస్తుంది. ఈ క్రమంలో యజమాని మురళి ఆమెను లైంగికంగా వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం సెలూన్ లో ఉన్న ఓ గదిలోకి దివ్యను లాక్కుపోయి మానభంగం చేసే ప్రయత్నం చేశాడు మురళి. ప్రతిఘటించిన దివ్య అతడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి కేకలు వేసింది. దీంతో మురళి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురైన దివ్య సెలూన్ లో ఉన్న శానిటైజర్ తాగి సూసైడ్ చేసుకుంది. ఇక దివ్య ఆత్మహత్య విషయంలో ఆమె కుటుంబ సభ్యులు సంచలన నిజాలను బయటపెట్టారు.

ఆత్మహత్యకు పాల్పడిన దివ్య అక్క మాట్లాడుతూ.. “మా చెల్లి ఆత్మహత్యకు సెలూన్ యజమాని మురళినే కారణమంటూ ఆరోపించింది. గత ఆరు నెలల నుంచి దివ్యను లైంగికంగా వేధిస్తున్నట్లు తెలిపింది. తనకు శారీరకంగా సహకరించకుంటే కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించినట్లు ఆమె వెల్లడించింది. దివ్య ఆరు నెలల క్రితం సెలూన్ షాపులో జాయిన్ అయింది. అప్పటి నుంచి దివ్య షాపు యజమాని వేధిస్తున్న విషయం చెప్పలేదని తెలిపింది. ఆకస్మాత్తుగా మొన్న సాయంత్రం పూట సెలూన్ యజమాని ఫోన్ చేసి మీ చెల్లి ఏదో తాగిందంటూ చెప్పాడంది. ఏం జరిగింది.. ఎందుకు తాగిందని ప్రశ్నించినప్పుడు మీరు ఇక్కడికి రండి ఆ తర్వాత మాట్లాడుకుందామని షాపు యజమాని చెప్పినట్లు తెలిపింది. దివ్యకు ఏమవుతుందోనన్న భయంతో వెంటనే సెలూన్ కు బయలుదేరామని తెలిపారు.

అప్పటికే యజమాని మురళి అక్కడి నుంచి పరారైనట్లు తెలిపింది. దివ్యను ఆసుపత్రికి తరలించే సమయంలో అక్కా సార్ మంచోడు కాదు. నా ఫ్యూచర్ ఆగం చేసిండు.. నేను బ్రతకను అని చెప్పిందని బాధితురాలి అక్క తెలిపింది. ఇదే విషయమై అక్కడ ఉన్న వాళ్లను అడగగా మురళి దివ్వను రూమ్ లోకి గుంజుకెళ్లి లైంగికంగా వేధిస్తూ కొట్టిండని.. ఆ తర్వాత గొంతుపై కాలు పెట్టి తొక్కాడని చెప్పినట్లు వెల్లడించింది. లైంగికంగా వేధిస్తున్న విషయం కుటుంబ సభ్యులకు చెబితే మీ అక్కను, అమ్మను చంపుతానని మురళి బెదిరించడంతోనే ఆరు నెలల నుంచి చెప్పలేదని దివ్య తమతో చెప్పినట్లు వెల్లడించింది. దివ్య మృతికి కారణమైన మురళిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు.