Krishna Kowshik
అత్త అనగానే గయ్యాళి గంప అని, కోడలు అంటే గడసరి అన్న అపవాదు ఉంది. కానీ నేటి కాలంలో అత్తాకోడళ్ల మధ్య కూడా మంచి బాండింగ్ ఉంటుంది. విలువ, గౌరవాన్ని ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. తాము అందరిలాంటి అత్తా, కోడళ్లం కాదని నిరూపిస్తున్నారు.
అత్త అనగానే గయ్యాళి గంప అని, కోడలు అంటే గడసరి అన్న అపవాదు ఉంది. కానీ నేటి కాలంలో అత్తాకోడళ్ల మధ్య కూడా మంచి బాండింగ్ ఉంటుంది. విలువ, గౌరవాన్ని ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. తాము అందరిలాంటి అత్తా, కోడళ్లం కాదని నిరూపిస్తున్నారు.
Krishna Kowshik
‘ఒకే ఇంట్లో రెండు కొప్పులు ఒక చోట ఇమడవు’అనేది సామెత ఉంది. సాధారణంగా ఈ నానుడి అత్తా, కోడళ్ల నుంచి ఉద్దేశించి వాడుకలోకి వచ్చింది. అందుకే ‘అత్త లేని కోడలు ఉత్తమురాలు.. కోడలు లేని అత్త గుణవంతురాలు’ అన్న మరో సేయింగ్ కూడా ఉంది. అంటే ఇద్దరిలో ఒక్కరు మాత్రమే ఉంటేనే.. బెటర్ అన్నట్లుగా ప్రచారం సాగింది. కానీ కాలం మారింది. బంధాలు, బంధుత్వాలు మారుతున్నాయి. అలానే అత్తాకోడళ్ల రిలేషన్లలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అత్తను అమ్మలా చూసుకునే కోడళ్లు ఉంటున్నారు. ఇంటికి వచ్చిన కోడల్ని.. కూతురిలా చూస్తున్న అత్తలు ఉన్నారు. అత్తపై గౌరవం, కోడలిపై ప్రేమ ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఎక్కడికి వెళ్లిన కలిసి వెళ్లడం, ఒకే మాట మీద నిలబడుతూ.. అత్తాకోడళ్ల బంధానికి వైరుధ్యంగా జీవిస్తున్నావారున్నారు.
ఇదిగో ఇలాంటి బంధమే వీరిది కూడా. అత్తతో అన్నీ పంచుకోవడమే కాదూ.. మరణంలోనూ ఆమెను వీడలేదు కోడలు. అత్త మరణాన్ని జీర్ణించుకోలేని కోడలు.. కొన్ని గంటల వ్యవధిలోనే కన్నుమూసింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదగిరి గుట్ట మండలం దాతారుపల్లి ఆవాసమైన గొల్లగుడిసె గ్రామానికి చెందిన చుక్కల భారతమ్మ (65) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమెకు కొడుకు, కోడలు మంగమ్మ ఉన్నారు. కాగా, భారతమ్మ తన తల్లికి ఒంట్లో బాగోకపోవడంతో చూసేందుకు భువనగిరి మండలం రాయగిరిలోని పుట్టింటికి వెళ్లింది. అయితే ఆదివారం ఆమెకు గుండెపోటు రావడంతో మరణించింది. ఈ విషయం కొడుకు, కోడలికి తెలిసింది.
భారతమ్మ మృతదేహాన్ని గొల్లగుడిసెకు తీసుకు వచ్చారు. అత్త మృతదేహాన్ని చూసిన వెంటనే కోడలు మంగమ్మ కన్నీటి పర్యంతమైంది. ‘అత్తా’ అంటూ భోరున విలపించింది. ఆమెకు కూడా ఒంట్లో బాగోకపోవడంతో ఏడ్వొద్దని చెప్పారు కుటుంబ సభ్యులు. తనను కూతురిలా చూసుకున్న అత్త ఇక తిరిగి రాదని, ఆమెను ఇక చూడలేనని భావించిన కోడలు ఏడుస్తూనే ఉంది. దీంతో మంగమ్మ కుప్పకూలిపోయింది. ఆమెను హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే గుండెపోటు రావడంతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అత్తా కోడళ్లు గంటల వ్యవధిలో మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. గొల్ల గుడిసెలో విషాధ చాయలు అలముకున్నాయి. అమ్మను, భార్యను పొగొట్టుకుని.. ఇద్దరు పిల్లలతో ఒంటరి అయిపోయాడు భర్త.