iDreamPost
android-app
ios-app

Yadagirigutta: యాదాద్రి భక్తులకు శుభవార్త.. పదేళ్ల తర్వాత ప్రారంభం.. కానీ

  • Published Aug 12, 2024 | 12:04 PM Updated Updated Aug 12, 2024 | 12:07 PM

Yadagirigutta-Vishnu Pushkarini: యాదాద్రి భక్తులకు శుభవార్త చెప్పారు. సుమారు పదేళ్ల తర్వాత.. వారికి ఆ అవకాశం కల్పించేందుకు ఆలయ అధికారులు రెడీ అవుతున్నారు. ఆ వివరాలు..

Yadagirigutta-Vishnu Pushkarini: యాదాద్రి భక్తులకు శుభవార్త చెప్పారు. సుమారు పదేళ్ల తర్వాత.. వారికి ఆ అవకాశం కల్పించేందుకు ఆలయ అధికారులు రెడీ అవుతున్నారు. ఆ వివరాలు..

  • Published Aug 12, 2024 | 12:04 PMUpdated Aug 12, 2024 | 12:07 PM
Yadagirigutta: యాదాద్రి భక్తులకు శుభవార్త.. పదేళ్ల తర్వాత ప్రారంభం.. కానీ

తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచింది యాదగిరిగుట్ట. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యాదాద్రి అభివృద్ధిపై ప్రత్యక దృష్టి సారించింది. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయం కొత్తగా మారిన తర్వాత.. యాదాద్రి నరసింహ స్వామి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. పండగలు, ప్రత్యేక​ పర్వదినాలు, సెలవు దినాల్లో భారీ ఎత్తున భ​క్తులు యాదాద్రి ఆలయానికి వెళ్లి.. స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా యాదాద్రి ఆలయ నిర్వహాకులు భక్తులకు శుభవార్త చెప్పారు. ఆ వివరాలు..

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు శుభవార్త. సుమారు పదేళ్ల తర్వాత భక్తులకు మళ్లీ.. కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణిలో సంకల్ప స్నానాలు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రావణ మాసం మొదటి ఆదివారంతో పాటు స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని.. యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య చేతుల మీదుగా.. విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పానికి శ్రీకారం చుట్టారు అధి​కారులు. అఖండ దీపారాధన, జ్యోతి ప్రజ్వలన చేసి స్నాన సంకల్పాన్ని ప్రారంభించారు ఆలయ అధికారులు.

పదేళ్ల నుంచి అనగా.. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం మొదలైన దగ్గర నుంచి.. కొండపైన పుష్కరిణిలో స్నానాలు చేయటాన్ని నిషేదించారు. అప్పటి నుంచి కొండ కింద ఏర్పాటు చేసిన లక్ష్మీ పుష్కరిణిలోనే భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు. కొండ కింద స్నానాలు ఆచరించి.. పైకి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవటానికి భక్తులు ఇబ్బంది పడుతుండటంతో.. మళ్లీ విష్ణు పష్కరిణిని ప్రారంభించాలని సంకల్పించారు ఆలయ అధికారులు. దీనిలో భాగంగానే కొండపై స్నాన సంకల్పాన్ని ప్రారంభించారు.

అయితే.. ఈ స్నాన సంకల్ప సౌకర్యాన్ని భక్తులకు ఉచితంగా అందించడం లేదు. ఇందుకోసం రూ.500 టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్ తీసుకున్నవారికి.. కేవలం స్నాన సంకల్పమే కాదు.. స్వామివారి ప్రత్యేక దర్శన సదుపాయం, లడ్డూ ఉచితంగా అందజేయనున్నారు. టికెట్ లేని భక్తులకు.. కేవలం పుష్కరిణిలో నీటిని తలపై చల్లుకునేందుకు మాత్రమే అనుమతిస్తారు. మరోవైపు.. శ్రావణ మాస మొదటి ఆదివారంతో పాటుగా స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రంలో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక గిరిప్రదక్షిణలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి ప్రధానాలయంతో పాటు అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ.. ఘనంగా పూజలు నిర్వహించారు. శ్రావణమాసం తొలి ఆదివారం సెలవు కావడంతో.. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş