iDreamPost

పుట్టినరోజు నాడే మృత్యువు ముంచుకొచ్చింది! పాపం ఇంత దారుణమా?

ఓ వివాహిత కూడా తన పుట్టిన రోజు జరుపుకునేందుకు పుట్టింటికి వెళ్లింది. తన ఇద్దరు చిన్నపాపలు, భర్తతో కలిసి తన అమ్మగారింటికి చేరింది. ఇక పుట్టిన రోజుకు వేడుకలకు సిద్ధమవుతున్న వేళ విషాదం చోటుచేసుకుంది.

ఓ వివాహిత కూడా తన పుట్టిన రోజు జరుపుకునేందుకు పుట్టింటికి వెళ్లింది. తన ఇద్దరు చిన్నపాపలు, భర్తతో కలిసి తన అమ్మగారింటికి చేరింది. ఇక పుట్టిన రోజుకు వేడుకలకు సిద్ధమవుతున్న వేళ విషాదం చోటుచేసుకుంది.

పుట్టినరోజు నాడే మృత్యువు ముంచుకొచ్చింది! పాపం ఇంత దారుణమా?

ప్రతి ఆడపిల్లలు పుట్టింటిపై ఎంతో ప్రేమ ఉంటుంది. అందుకే  అత్తారింట్లో అడుగుపెట్టిన తరువాత కూడా తల్లిగారింటికి వెళ్లే సందర్భంలో ఎంతో సంతోషంగా ఉంటారు. అలానే ఓ వివాహిత కూడా తన పుట్టిన రోజు జరుపుకునేందుకు పుట్టింటికి వెళ్లింది. తన ఇద్దరు చిన్నపాపలు, భర్తతో కలిసి తన అమ్మగారింటికి చేరింది. ఇక పుట్టిన రోజుకు వేడుకలకు సిద్ధమవుతున్న వేళ.. ఆ చేసిన చిన్నపొరపాటు.. ఆ ఇంట్లో పెను విషాదం నింపింది. ఇద్దరి పసిపిల్లలు తల్లిలేని అనాథలుగా మిగిలారు. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ బాలాంజలి(25)కి రాజపేట మండలం పారుపల్లి గ్రామానికి చెందిన భూపతి సురేష్‌తో వివాహం జరిగింది. వీరి పెళ్లి నాలుగు సంవత్సరాల క్రితం జరగ్గా..ఎంతో సంతోషంగా సంసారం సాగిస్తున్నారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె తన్వి రెండేళ్లు, చిన్న కుమార్తె ఆద్యకు ఆరు నెలలు ఉన్నాయి. బాలాంజలి, సురేష్ దంపతులు ప్రస్తుతం హైదరాబాద్‌లోని లాలపేటలో నివాసం ఉంటున్నారు. అతడు స్థానికంగా ఉద్యోగం చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇక పుత్తడి బొమ్మల్లాంటి బిడ్డలు, ఏ కష్టం రాకుండా చూసునే భర్తతో బాలాంజలి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంది.

ఇక తన పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఉదయం తన భర్త, పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఉదయం అంతా తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపింది. ఇక మధ్యాహ్నం సమయంలో బాలాంజలి దుస్తులు ఉతుకుతుంది. ఈ క్రమంలో ఆమె ఉతికే..తడి బట్టలు నీటి మోటార్‌కు ఉన్న విద్యుత్తు తీగ తగిలాయి. దీంతో ఒక్కసారిగా ఆ వివాహిత షాక్‌కి గురైంది. కరెంట్ షాకి గురై.. అపస్మారకస్థితికి చేరిన బాలాంజలిని కుటుంబ సభ్యులు గమనించారు. ఇక వెంటనే ఆమె భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలాంజలి పుట్టిన రోజు నాడే మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అప్పటి వరకు తమతోనే ఉన్న అమ్మ మృత్యువు ఒడిలోకి జారుకుందని ఆ పసి పిల్లలకేం తెలియదు. విగత జీవిగా పడి ఉన్న తల్లిని చూస్తూ పాలు తాగాలని.. గోరుముద్దలు తినాలని గుక్కపట్టి ఏడుస్తున్న దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి