iDreamPost
android-app
ios-app

భర్త ఆస్తిపై కన్ను.. తెలంగాలో చంపి.. కర్ణాటకలో దహనం! సినీ తరహాలో క్రైమ్

  • Published Oct 28, 2024 | 12:36 PM Updated Updated Oct 28, 2024 | 12:36 PM

Hyderabad Crime News: డబ్బు కోసం ఈ మధ్య ఎలాంటి దారుణాలకైనా తెగబడుతున్నారు. భర్త ఆస్తిపై కన్నేసిన భార్య తన ప్రియుడితో కలిసి దారుణమైన పని చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లో తీవ్ర కలకలం సృష్టిస్తుంది.

Hyderabad Crime News: డబ్బు కోసం ఈ మధ్య ఎలాంటి దారుణాలకైనా తెగబడుతున్నారు. భర్త ఆస్తిపై కన్నేసిన భార్య తన ప్రియుడితో కలిసి దారుణమైన పని చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లో తీవ్ర కలకలం సృష్టిస్తుంది.

  • Published Oct 28, 2024 | 12:36 PMUpdated Oct 28, 2024 | 12:36 PM
భర్త ఆస్తిపై కన్ను.. తెలంగాలో చంపి.. కర్ణాటకలో దహనం! సినీ తరహాలో క్రైమ్

పెద్దల సమక్షలో అగ్నిసాక్షిగా..మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య అక్రమ సంబధాలు చిచ్చుపెడుతున్నాయి. క్షణిక సుకాల కోసం అడ్డదార్లు తొక్కుతున్నారు. ప్రియుడి మోజులో లేదా ప్రియురాలి మోజులో పడి భార్యాభర్తలు ఒకరినొకరు దారుణంగా చంపుకుంటున్నారు. అక్రమ సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వారి పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారు.సినిమాలు, సోషల్ మీడియా ప్రభావమో తెలియదు కానీ వివాహేతర సంబంధాలు ఎన్నో దారుణాలు సృష్టిస్తున్నాయి. దేశంలో నిత్యం ఇలాంటి ఘటనలు ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. భర్త ఆస్తిపై కన్నేసిన భార్య తన ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓ మహిళ పెళ్లై భర్తతో హ్యాపీగా కాపురం చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. కట్ చేస్తే.. భర్త ఆస్తి కోసం ప్రియుడితో కలిసి పక్కా పథకం ప్రకారం హత్య చేసింది. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ హత్య తీవ్ర కలకలం రేపుతుంది. ప్రియుడితో కలిసి తెలంగాణలో హత్య చేసిన భార్య.. కర్ణాటకలో భర్త శవాన్ని కాల్చివేసింది. వివరాల్లోకి వెళితే..  హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపారి రమేష్ (54) కి నిహారికతో పెళ్లైంది. కొంతకాలం వీరి సంసారం హ్యాపీగా కొనసాగింది. నిహారికకు డాక్టర్ నిఖిల్ పరిచయం అయ్యింది. ఆ పరిచయం అక్రమసంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే ప్రియుడి మాటలు విని భర్త ఆస్తి కాజేయాలని ప్లాన్ వేసింది నిహారిక. ఈ క్రమంలోనే భువనగిరి ప్రాంతంలో ప్రియుడు నిఖిల్ తో కలిసి భర్తను హత్య చేసింది నిహారిక. అనంతరం శాన్ని కారులో కర్ణాటకకు తీసుకువెళ్లి ఓ కాఫీ ఎస్టేట్ లో శవాన్ని కాల్చివేశారు. కాఫీ ఎస్టేట్ లో పని చేస్తున్న కొంతమంది సగం కాలిన మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభిచారు.

విచారణలో భాగంగా మృతుడు హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్త రమేష్   గుర్తించారు. విచారణలో దిమ్మతిరిగేలా వాస్తవాలు వెలుగు చూశాయి. ఆస్తి కోసం భర్త రమేష్ ని భార్య నిహారిక తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. రూ.8 కోట్ల ఆస్తి కోసం ప్రియుడు డాక్టర్ నిఖిల్ మైరెడ్డితో కలిసి రమేష్ ని హత్య చేసింది నిహారిక. ఆ తర్వాత మృతదేహాన్ని నిందితులు మెర్సిడెస్ బెంజ్ కారులో కర్ణాటక పరిధిలోని కొడగు కాఫీ ఎస్టేట్ కి తరలించారు. ఇందుకోసం రాణా అనే మరో వ్యక్తి సహాయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రమేష్ డెడ్ బాడీని తగులబెట్టిన తర్వాత ఎవరి దారిన వారు వెళ్లారు. రాణా అనే నిందితుడిని హర్యానాలో ఓ దాబాలో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు కర్ణాటక పోలీసులు. పోలీసుల విచారణలో ఆస్తి కోసమే ఈ హత్య చేసినట్లు భార్య నిహారిక ఆమె ప్రియుడు నిఖిల్ నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యాపారవేత్త రమేష్ ది హైదరాబాద్ కాగా, భార్య నిహారికది యాదాద్రి జిల్లా భువనగిరి. ఆమె ప్రియుడు నిఖిల్ సొంతఊరు కడప జిల్లాగా పోలీసులు చెబుతున్నారు.

 

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomgrandpashabetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom