ఆకాశం నుంచి ఊడిపడ్డ మహిమ గల పెట్టె! ఏకంగా రూ.50కోట్లుకి

దేశంలో టెక్నాలజీ పేరుగుతున్న కాలంలో ప్రజలు ఇంక ఈ మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. దీనినే ఆసరగా తీసుకుని కొంతమంది కేటుగాళ్లు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఇలానే కొందరు తమ వద్ద మహిమ గల వస్తువు ఉందంటూ నగరంలో కొంతమందికి భారీగా వల వేశారు. చివరికి ఏం జరిగిందంటే..

దేశంలో టెక్నాలజీ పేరుగుతున్న కాలంలో ప్రజలు ఇంక ఈ మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. దీనినే ఆసరగా తీసుకుని కొంతమంది కేటుగాళ్లు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఇలానే కొందరు తమ వద్ద మహిమ గల వస్తువు ఉందంటూ నగరంలో కొంతమందికి భారీగా వల వేశారు. చివరికి ఏం జరిగిందంటే..

టెక్నాలజీ పేరుగుతున్న దేశంలో ప్రజలు ఇంక మూఢనమ్మకాల వలలో చిక్కుకుపోతున్నారు. తరుచు ఏదో ఒక చోట అమాయకపు ప్రజలు ఈ మూఢ విశ్వసాలకు ఆకర్షితులై మోసపోతున్నారు. ఇక ఇలాంటి వారినే టార్గెట్ చేసి అత్యాశ చూపే ముఠా రాను రాను పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే చాలామంది కేటుగాళ్లు.. అమాయకులకు లేని అపోహలు సృష్టించడం, దైవ మహిళలు అంటూ బురిడీ కొట్టించడం వంటివి చేస్తున్నారు. అచ్చం ఇలానే ఓ దొంగ ముఠా ఏకంగా ఆరుగురి అమాయకులకు బురిడీ కొట్టి వారి దగ్గర పెద్ద మొత్తంలోనే నగదు దోచుకుని తప్పించుకొని తిరుగుతున్నారు. అయితే తాజాగా మరో వ్యక్తికి తమ వద్ద ఆకాశం నుంచి ఊడిపడిన మహిమగల వస్తువు ఉందంటూ నమ్మించసాగారు. కానీ, అంతలోనే ఆ కేటుగాళ్లకి ఊహించని షాక్ తగిలింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవలే ఓ మాయ ముఠా తమ వద్ద ఉన్నది మామూలు పెట్టెకాదని, అది ఆకాశం నుంచి ఊడిపడిందని..దాన్ని ముట్టుకుంటే వైబ్రేట్ అవుతుందని ఓ ఆరుగురుని నమ్మబలికింది. అలాగే దీనికి ఏదైనా ఇనుప ముక్కను తగిలిస్తే.. అది నిప్పు రవ్వలు చిమ్ముతుంది. అంతటి మహిమ గల పెట్టే నా దగ్గర ఉందని.. అది ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గర ధనం వచ్చి చేరుతుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చ అంటూ మాయ మాటలు చెబుతూ మోసాలకు పాల్పడుతోంది. ఇక వీరిలో మాయలో అమాయకులనే అసరాగా తీసుకొని నిలువునా ముంచుతున్నారు. అయితే పోలీసులు కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌ మండలం మున్ననూరు గ్రామానికి చెందిన కేతావత్‌ శంకర్‌, వికారాబాద్‌ జిల్లా తాండూరుకు చెందిన మహమ్మద్‌ అజార్‌, నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం బండ గ్రామానికి చెందిన ఖాసీం, నల్లగొండ జిల్లా డిండి మండలం దేవత్‌పల్లి తండాకు చెందిన కొర్ర సాసిరాం హైదరాబాద్‌లో కూలీ పనులకు వెళుతుంటారు.

ఈ నలుగురు కలిసి ఈజీగా డబ్బు సంపాదించాలనే పథకంతో ఓ పెట్టె కొన్నారు. పైగా ఆ పెట్టెకు ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అమర్చి, ఆ పెట్టెపై అయస్కాంతం పెడితే వైబ్రేషన్ వచ్చేట్టు చేశారు. ఇక ఆ పెట్టేకు ఎన్నో మహిమలు ఉన్నాయని, ఆ పెట్టె ఎవరి దగ్గర ఉంటే వాళ్లు ధనవంతులవుతారని పలువురిని నమ్మించారు. అంతేకాకుండా.. దాని ధర రూ.50 కోట్లు ఉంటుందని చెప్పి.. రూ.5 నుంచి 10 లక్షల వరకు బేరం కుదుర్చుకునేవారు. అలా చాలామంది నుంచి రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలు అడ్వాన్స్ తీసుకొని తప్పించుకు తిరిగేవారు. ఇలా ఇప్పటి ఎంతోమంది వద్ద సుమారు రూ.20 లక్షలు వసూలు చేశారు.

అయితే తాజాగా సోమవారం హైదరాబాద్‌ నుంచి ఓ నలుగురు వ్యక్తులు ఆ పెట్టెను పట్టుకుని ఆటోలో బయల్దేరారు. ఈ క్రమంలోనే జాతీ రహదారిపై పెంబర్తి వై జంక్షన్‌ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అయితే పోలీసులను చూసిన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా.. వారిని వెంబడించి పట్టుకున్నారు. దీంతో పోలీసులకు చిక్కిన కేటుగాళ్లను దర్యాప్తు చేయగా.. ఈ నాలుగురు ఆ పెట్టేను ఓ వ్యక్తికి రూ.50 కోట్ల ధరకు అమ్మేందుకు సిద్ధమయ్యారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరి, మోసపోయేవారు ఉన్నంత వరకు మోసం చేసేవారు మోసం చేస్తున్న ఈ ఘటనల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments