Krishna Kowshik
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు రోజులు అయిపోయాయి.. కానీ ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ముఖ్యమంత్రి ఎవరు అన్నదానిపై కాంగ్రెస్ లో ఇంకా క్లారిటీ రాలేదు. ఎవరినీ సీఎం చేయాలన్న అంశంపై అధిష్టానం కూడా మల్లగుల్లాలు పడుతూనే ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు రోజులు అయిపోయాయి.. కానీ ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ముఖ్యమంత్రి ఎవరు అన్నదానిపై కాంగ్రెస్ లో ఇంకా క్లారిటీ రాలేదు. ఎవరినీ సీఎం చేయాలన్న అంశంపై అధిష్టానం కూడా మల్లగుల్లాలు పడుతూనే ఉంది.
Krishna Kowshik
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్న సందిగ్థత నెలకొంది. ఫలితాలు విడుదలై రెండు రోజులు అవుతున్నా ముఖ్యమంత్రి ఎవరన్నదీ క్లారిటీ లేదు. సీఎల్పీ సమావేశాన్ని నిర్వహించినా కొలిక్కి రాలేదు. ఈ అంశంపై అధిష్టానం పలువురు కీలక నేతలతో మాటా మంతీ జరిపింది. అయినా సీఎం పీఠాన్ని అధిరోహించేది ఎవరో స్పష్టత రాలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయనే తాను ఇక్కడకు వచ్చానని తెలిపారు. తాను సీఎం రేసులో ఉన్నానని తెలిపారు. ‘మొదటి నుండి నేను కాంగ్రెస్ లోనే ఉన్నా. పార్టీని ఎప్పుడూ వీడలేదు. అలాగని నేనేం బయట నుండి రాలేదు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. కాంగ్రెస్ పెద్దలను కలిశా. చెప్పాల్సింది చెప్పాను’ అని పేర్కొన్నారు.
‘నేను, నా భార్య పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నాం. నాకు అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వర్తిస్తుంటా. ప్రతి ఎన్నికకు ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. నేను పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు బీఆర్ఎస్‌పై ఇంత వ్యతిరేకత లేదు. ఇప్పుడు నెగిటివిటీ చాలా ఉంది. పీసీసీ ప్రెసిడెంట్ ను కాదు కాబట్టి ఆ స్థాయిలో ప్రచారం చేయలేకపోయాను. ఫలితాల్లో 70 స్థానాలు వస్తాయని ఊహించా.. కానీ 64 దగ్గరే ఆగిపోయాం. హైదరాబాద్ వాష్ అవుట్ అయ్యాం. ఇలాంటి ఫలితం వస్తుందని ఊహించలేదు కూడా. అలాగే సీఎం ఎంపిక విషయంలో జాప్యం ఏమీ చోటుచేసుకోవడ లేదు. ఫలితాలు వచ్చి 48 గంటలే అయ్యాయి’ అని చెప్పారు.
అధిష్టానం సీఎం అభ్యర్థిని ఎవరినీ ఎంపిక చేస్తే.. ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటామన్న ఆయన.. విధేయత, ట్రాక్ రికార్డు, సొంత ఇమేజ్ వంటి అంశాలను పరిశీలించాలని అంటున్నారు. అదే క్రమంలో తాను బయట నుండి రాలేదని, పార్టీని వీడలేదంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ మోస్ట్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సీఎం అభ్యర్థి రేసులో ఉన్న రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా చేసినవా లేక.. పార్టీకి తాను చేసిన సేవలను గుర్తించాలని చెబుతున్న మాటలో అన్న సందేహం ఏర్పడకమానదు. ఏదేమైనప్పటికీ.. ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో అన్నది తేలలేదు. ఇంతకు ముఖ్యమంత్రి అభ్యర్థి మీరెవ్వరు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.