iDreamPost
android-app
ios-app

విషాదం.. స్కూల్ బస్సు కిందపడి రెండేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్ హబ్సిగూడలోని రవీంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతితో కుటుంబం సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.

హైదరాబాద్ హబ్సిగూడలోని రవీంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతితో కుటుంబం సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.

విషాదం.. స్కూల్ బస్సు కిందపడి రెండేళ్ల చిన్నారి మృతి

ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో ఊహించలేము. ఆకస్మాత్తుగా చోటుచేసుకునే ప్రమాదాలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతాయి. అప్పటి వరకు తమతో ఉన్నవారు విగతజీవులుగా మారడంతో గుండెలు పగిలేలా రోదిస్తారు. ఇలాంటి ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారిని ఓ స్కూల్ బస్సు చిదిమేసింది. అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు నాన్నతో పాటు వచ్చిన చిన్నారిని స్కూల్ బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. డ్రైవర్ నిర్లక్ష్యమో లేదా ప్రమాదవాశాత్తు జరిగిందో కానీ రెండేళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది స్కూల్ బస్సు. ఈ విషాద ఘటన నగరంలోని హబ్సిగూడలో చోటుచేసుకుంది.

ఈ మద్య హైదరాబాద్ లో స్కూల్ బస్సు ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. డ్రైవర్లు అజాగ్రత్తగా, నిర్లక్ష్యపూరితంగా బస్సులను నడపడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియమాలను అమలు చేస్తున్నప్పటికీ వాటిని ఉల్లంఘించి వాహనదారులు ప్రమాదాలకు కారణమవుతున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ క్రమంలో హబ్సిగూడలోని రవీంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు స్కూల్‌ బస్సు కిందపడి రెండేళ్ల చిన్నారి జావ్లానా మృతి చెందింది.

రోజు మాదిరిగానే ఈ రోజు కూడా తన అన్నయ్యను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తన తండ్రి, అమ్మమ్మతో కలిసి చిన్నారి జావ్లానా రోడ్డుపైకి వచ్చింది. ఈ క్రమంలో సోదరుడిని బస్సు ఎక్కించిన తర్వాత డ్రైవర్‌తో చిన్నారి తండ్రి మిథున్‌ మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో అమ్మమ్మతో ఉన్న చిన్నారి.. నాన్న వద్దకు వెళ్తానంటూ పరుగులు తీసింది. ఈ క్రమంలో స్కూల్ బస్సు డ్రైవర్‌ పాపను గమనించకుండా వాహనాన్ని ముందుకు తీశాడు. ప్రమాదవశాత్తు రెప్పపాటులో టైర్‌ కిందపడి చిన్నారి మృతి చెందింది.

కంటికి రెప్పలా కాపాడుకుంటున్న చిన్నారి తమ కళ్ల ముందే విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే తమ పాప మృతి చెందిందని కుటుంబసభ్యులు పాఠశాల దగ్గర నిరసనకు దిగారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా స్కూల్ బస్సు కిందపడి చిన్నారి మృతి చెందిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి