Dharani
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఎకరానికి 10 వేల చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు రెడీ అయ్యింది. 2 రోజుల్లో ఖాతాలో డబ్బులు జమ చేయనుంది. ఆ వివరాలు..
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఎకరానికి 10 వేల చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు రెడీ అయ్యింది. 2 రోజుల్లో ఖాతాలో డబ్బులు జమ చేయనుంది. ఆ వివరాలు..
Dharani
రాష్ట్రంలో ఓవైపు ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవక.. పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడుతుండగా కొన్ని చోట్ల మాత్రం.. కాస్త భిన్న వాతావరణం కనిపించింది. తాజాగా కొన్ని ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. చేతికి అంది వచ్చిన పంట.. అకాల వర్షాల కారణంగా.. నేలకొరిగింది. మామిడి, నిమ్మ, బత్తాయి వంటి ఉద్యానవన పంటలు పండించిన రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. వరి ధాన్యం అయితే వానకు తడిసి పొలంలోనే మొలకలు వచ్చేసింది.
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడం కోసం ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్.. క్షేత్రస్థాయిలో పంటలను పరిశలించి.. రైతులకు ధైర్యం చెప్పారు. అన్నదాతలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. పంట నష్టపోయిన అన్నదాతలకు ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున పరిహారం ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయ్యింది.
వడగళ్లు, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అకాల వర్షాల కారణంగా.. రాష్ట్రంలో సుమారు 15,246 మంది రైతులకు చెందిన 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో పంట నష్టపోయిన రైతులకు.. ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.15.81 కోట్లు చెల్లించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎన్నికల సంఘం అనుమతితో.. ఈ రెండు రోజుల్లో.. రైతుల ఖాతాల్లోకి పంట నష్ట పరిహారం డబ్బులు జమ చేయనున్నారు సీఎం రేవంత్.
ఇక రైతు రుణమాఫీ, వరికి రూ. 500 బోనస్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం నాడు కీలక ప్రకటన చేశారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటామని.. ఆగస్టు 15 తేదీలోపు ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే వరి పంటకు రూ. 500 బోనస్‌ను ఇచ్చి ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.