iDreamPost
android-app
ios-app

పాలు విరిగాయని.. ప్రాణం పోయేలా భార్యను కొట్టిన భర్త!

ఎంతో అభివృద్ధి చెందిన నేటి సమాజంలో కూడా ఇంకా ఏదో ఒకచోట మహిళలు అత్తింటి వారి వేధింపులకు గురవుతున్నారు. తాజాగా ఓ మహిళ విషయంలో ఆమె భర్త కసాయిలా ప్రవర్తించాడు

ఎంతో అభివృద్ధి చెందిన నేటి సమాజంలో కూడా ఇంకా ఏదో ఒకచోట మహిళలు అత్తింటి వారి వేధింపులకు గురవుతున్నారు. తాజాగా ఓ మహిళ విషయంలో ఆమె భర్త కసాయిలా ప్రవర్తించాడు

పాలు విరిగాయని.. ప్రాణం పోయేలా భార్యను కొట్టిన భర్త!

నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు. మగవారికి పోటీగా తమ సత్తాను చాటుతున్నారు. ఇంతలా సమాజాభివృద్ధిలో దూసుకెళ్తున్న మహిళల్లో కొందరు ఇంకా వేధింపులకు గురవుతున్నారు. ఆఫీసుల్లో, ఇంట్లో  వివిధ రకాల వేధింపులకు గురవుతున్నారు. ముఖ్యంగా చికెన్ లో ఉప్పు తక్కువైందని, వంట సరిగ్గా వంటలేదని కొందరు భర్తలు హింసలకు గురి చేస్తున్నారు. భార్యలపై  భౌతిక దాడికి దిగి..వేధింపులకు గురి చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ విషయంలో ఆమె భర్త కసాయిలా ప్రవర్తించాడు. పాలు విరిగాయని ప్రాణాలు పోయేలా భార్యను కొట్టాడు ఓ భర్త. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం..

ఎంతో అభివృద్ధి చెందిన నేటి సమాజంలో కూడా ఇంకా ఏదో ఒకచోట మహిళలు అత్తింటి వారి వేధింపులకు గురవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న వేధింపులను నివారించేందుకు ఎన్ని చట్టాలు చేసినా.. ఇంకా ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. గృహ హింస నివారణకు చట్టాలు ఎన్ని తెచ్చిన రోజుకో చోట మహిళ ..భర్త కుటుంబ సభ్యుల నుంచి చిత్రహింసలకు గురవుతూనే ఉంది. గురువారం హైదరాబాద్ లోని మధురానగర్ ఎల్లారెడ్డి గూడలోకూడా ఓ గృహిణి విషయంలో దారుణం జరిగింది. అక్మల్ హుస్సేన్, హీనా బేగం అనే దంపతులు తమ కుటుంబంతో కలిసి ఎల్లారెడ్డి గూడలో ఉంటున్నారు.

అయితే  కొంతకాలం నుంచి అక్మల్, హీనా మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అదనపు కట్నం కోసం భార్య హీనా బేగంని అత్తింటి వారు రోజూ చిత్ర హింసలకు గురి చేసే వారని సమాచారం. ఈక్రమంలోనే బుధవారం పొయ్యి మీద పెట్టిన పాలు విరిగాయి. దీంతో పట్టరాని కోపంతో ఆమె పై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. పాలు విరిగాయని ఆ భర్త తన తనను ప్రాణం పోయేలా కొట్టాడని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తతో పాటు అత్తింటి వారి నుంచి రోజూ వేధింపులకు గురవుతున్నాని ఆ మహిళ చెబుతుంది. మూడు రోజుల పాటు రూమ్ లో బంధించి ఘోరం దాడి చేశాడని తెలిపింది.

అంతేకాక ఆ మహిళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. మీ కుమార్తె చనిపోయింది అంటూ చెప్పారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒళ్ళంతా గాయాలతో కమిలిపోయి ఉన్న కుమార్తెను చూసి కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు. ఇక బాధితురాలిని ఆస్పత్రిలో చేర్చారు. బేగం తన అత్తింటి వారు పెట్టే చిత్ర హింసలు తట్టుకోలేక స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా గతంలో కూడా పలువురు మహిళలు అత్తింటి వారి వేధింపులకు నరకం అనుభవించిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. మరి.. ఇలాంటి ఘోరాల నివారణకు  ఏం చేయాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.