P Krishna
Karimnagar Crime News: ఈ మధ్య కాలంలో కొంతమంది ఈజీ మనీ కోసం ఆన్ లైన్ లో జూదం ఆడుతూ వేలు, లక్షలు పోగొట్టుకొని జీవితాలు ఛిద్రం చేసుకుంటున్నారు.
Karimnagar Crime News: ఈ మధ్య కాలంలో కొంతమంది ఈజీ మనీ కోసం ఆన్ లైన్ లో జూదం ఆడుతూ వేలు, లక్షలు పోగొట్టుకొని జీవితాలు ఛిద్రం చేసుకుంటున్నారు.
P Krishna
అదృష్టం ఉంటే ఏదైనా కలిసి వస్తుంది.. దురదృష్టం ఉంటే ఉన్నది ఊడ్చుకుపోతుందని అంటుంటారు. ఈ మధ్య కాలంలో చాలా మది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని తపనతో అడ్డదారులు వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడి పెట్టి లక్షలు పోగొట్టుకుంటున్నారు. లక్షల్లో ఎవరికో ఒక్కరికి అదృష్టం బాగుండి కలిసి వస్తే.. లక్షల మంది ఆన్ లైన్ మోసాలకు బలిఅవుతున్నారు. అప్ప తెచ్చి మరీ బెట్టింగ్స్, ఆన్ లైన్ జూదంలో పెట్టుబడి పెట్టి అవి పోగొట్టుకొని ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. మంచి ఉద్యోగం, వేతనం ఉన్న ఓ ఇంజనీర్ ఆన్ లైన్ జూదానికి బానిస అయ్యాడు.. చివరికి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
ఈ మధ్య కాలంలో చిన్న పెద్దా అనే తేడా లేకుండా ఆన్ లైన్ గేమింగ్స్ కి బానిస అవుతున్నారు. ఒక్కసారిగా డబ్బు వచ్చి పడాలన్న ఆశతో ఆన్ లైన్ జూదానికి అలవాటు పడి ఆర్థికంగా దెబ్బతింటున్నారు. అప్పులు తెచ్చి ఆన్ లైన్ జూదంలో పెట్టుబడి పెట్టి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సరదాగా మొదలైన బెట్టింగ్ ఆట పదుల నుంచి మొదలై లక్షలకు చేరి చివరికి వ్యసనంగా మారి యువత జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా గంగాధరలో ఆన్ లైన్ గేమ్ కి కొంతకాలంగా బానిస అయ్యాడు యువ ఇంజనీర్. ఇందుకోసం ఫ్రెండ్స్, బంధువుల వద్ద ప్పటు చేశాడు. ఆన్ లైన్ లో భారీగా నష్టం రావడంతో ఎవరికీ ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
కరీంనగర్ జిల్లా గందాధరకు చెందిన నాగుల లక్ష్మణ్, లక్ష్మీల తనయుడు వృథ్వి(25) బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లో ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా మంచి జాబ్ చేస్తున్నాడు. మంచి ఉద్యోగం, హ్యాపీ జీవితం. ఇటీవల జాబ్ పనిపై ఉత్తర ప్రదేశ్ లోని నోయిడా కు వెళ్లాడు. ఈ క్రమంలోనే స్నేహితులతో కలిసి ఉండగా ఆన్ లైన్ గేమింగ్ కి అలవాటు పడ్డాడు. ఇందుకోసం తన స్నేహితుల వద్ద పలు కారణాలు చెప్పి రూ.12 లక్షల వరకు అప్పచేశాడు. ఆ డబ్బు 4 రోజుల్లో మొత్తం పోగొట్టుకున్నాడు. దీంతో 15 రోజులుగా జాబ్ కి వెళ్లకుండా తన గదిలో ఉన్నాడు. అప్పులు తీర్చే మార్గం లేక శనివారం ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. ఈ మేరకు నోయిడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.