P Krishna
Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో చలి వాతావరణం నెలకొంది. మిట్ట మధ్యాహ్నం కారుమబ్బులతో చీకటిగా కనిపిస్తుంది.
Heavy Rain in Hyderabad: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో చలి వాతావరణం నెలకొంది. మిట్ట మధ్యాహ్నం కారుమబ్బులతో చీకటిగా కనిపిస్తుంది.
P Krishna
హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో వాతావరణం మొత్తం చలి వాతావరణం నెలకొంది. మిట్ట మధ్యాహ్నం కారుమబ్బులతో చీకటిగా కనిపిస్తుంది. నగరంలోని కర్మన్ ఘాట్, చంపాపేట్, ఎల్ బీ నగర్, నాగోల్, బంజారా హిల్స్ లో భారీ వర్షం పడుతుంది. ఈ ప్రాంతాలతో పాటు చైతన్యపురి, సైదాబద్, మలక్ పేట్ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. నిన్నటి వరకు వేడిగా ఉన్న వాతావరణం చల్లగా మారింది. హైదరాబాద్ లో కుండపోత వర్షం పడుతుంది.. సిటీ మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది.. నగర్ వాసులు అలర్ట్ గా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు.
హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది. నగరంలో ఉదయం నుంచి అధిక ఉష్ణోగ్రత, వడగాలులతో జనాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అనూహ్యంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి వాతావరణంలో మార్పులు సంభవించాయి. నగరం మొత్తం నల్లని మబ్బులు కమ్మేశాయి. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.మే 16 సాయంత్రం నుంచి క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన విషయం తెలింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఆకాశానికి చిల్లు పడిందా అన్న చందంగా వర్షం పడుతుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, కుకట్ పల్లి, నిజాంపేట, జీడిమెట్ల, సికింద్రాబాద్ ఏరియాలో ఊదురుగాలులతో కూడి వర్షం దంచి కొడుతుంది.
నగర వాసులు మరో రెండు మూడు గంటల వరకు బయటకు రాకుండా ఉంటే మంచిదని జీహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు. జగద్గిగిరిగుట్ట, బాలానగర్, మేడ్చల్, కీసర, కుత్ బుల్లాపూర్, అల్వాల్ ఏరియాల్లో భారీ వర్షం పడుతుంది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలకు భారీ వర్షం కారణంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు జీహెచ్ఎంసీ అధికారులు. వర్షం కారణంగా ఎక్కడ చూసినా రోడ్లన్నీ నీటితో మునిగిపోయాయి. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న వారు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయ్యింది. ఎక్కువగా నీరు నిలిచిన ప్రాంతాల్లో వాహనదారులు మెల్లిగా వెళ్లాలని సూచించారు. మరోవైపు డిజాస్టర్, జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.