iDreamPost
android-app
ios-app

కుక్క పిల్లలను కూడా వదలని దొంగలు! ఏం చేశారంటే..

ఇటీవల కాలంలో దొంగలు తెగ రెచ్చిపోతున్నారు. తరచూ ఏదో ఒక ప్రాంతంలో చోరీ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా హైదరాబాద్ లో జరిగిన చోరీలో దొంగలు కుక్క పిల్లలను సైతం వదల్లేదు.

ఇటీవల కాలంలో దొంగలు తెగ రెచ్చిపోతున్నారు. తరచూ ఏదో ఒక ప్రాంతంలో చోరీ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా హైదరాబాద్ లో జరిగిన చోరీలో దొంగలు కుక్క పిల్లలను సైతం వదల్లేదు.

కుక్క పిల్లలను కూడా వదలని దొంగలు!  ఏం చేశారంటే..

నేటికాలంలో అక్రమ సంపాదనకు అలవాటు పడిన వారి సంఖ్య బాగా పెరిగింది. ఇళ్లలు, దుకాణాలు, షాపుల్లో విలువైన వస్తువులను, డబ్బులను చోరీ చేస్తుంటారు. రేయింబవళ్లు కష్టపడి సంపాదించుకున్న సొమ్మును కొందరు కేటుగాళ్లు దొంగిలిస్తుంటారు. పేదలు బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును సైతం  దొంగిలిస్తున్నారు. ఇలా దొంగలు రెచ్చిపోయి..పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా కుక్క పిల్లను సైతం వదలకుండా దొంగిలించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్ లోని ఎన్‌ఎఫ్‌సీనగర్‌ బాలాజీ నగర్‌ ప్రాంతంలో ఐలయ్య అనే వ్యక్తి కుటుంబం తో కలిసి నివాసం ఉంటున్నారు. గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ఐలయ్య నల్లగొండ జిల్లా అంబాల గ్రామంలో జరిగిన పెళ్లికి హాజరయ్యారు. ఇక అక్కడ పెళ్లి కార్యక్రమాలు ముగిసిన అనంతరం తిరిగి హైదరాబాద్ కి  బయలుదేరారు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చేసరికి మెయిన్‌ డోర్‌ తాళాలు పగులగొట్టి  ఉండటాని కుటుంబ సభ్యులు గమనించారు. లోపల ఏం జరిగిందా అని  వారు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఇంటి లోపలకి వెళ్లి పరిశీలించగా బీరువా తాళం పగులగొట్టి ఉంది. అలానే అక్కడ వస్తువులు చిందరవందరగా పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించారు.

అల్మరాలో దాచిన 7.5 గ్రాముల బంగారం, 11 తులాల వెండి రూ. 5 వేల నగదును దొంగలు చోరీ చేశారు.  ఇంకా ఏమైనా వస్తువులను చోరీ చేశారేమో అని చూశారు. ఈక్రమంలో వారు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్ల కనిపించలేదు. పరిసరాల్లో ఏమైనా ఉందేమోనని చాలాసేపు వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సొమ్ముతో పాటు కుక్క పిల్లను కూడా అపహరించినట్లు బాధితులు తెలిపారు. చోరీ ఘటనపై బాధితులు స్థానిక పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్‌ టీం తో కలిసి వివరాలు సేకరించారు. బాధితుడు ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే కుక్కపిల్లను కూడా అపహరించడంపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి..దొంగతనాలను అరికట్టేందుకు నివారణ చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.