iDreamPost
android-app
ios-app

వీడియో: పార్కింగ్ విషయంలో గొడవ..హోటల్ యజమాని దారుణ హత్య

పగలు, ప్రతికారాలతో కొందరు మనుషులు మృగాళ్లా మారిపోతున్నారు. ప్రతి చిన్న విషయాన్నికి ఎదుటి వ్యక్తిపై కక్ష పెంచుకునే మూర్ఖుల సంఖ్య రోజు రోజుకు పెరిగుతుంది. తాజాగా పార్కింగ్ విషయంలో గొడవ పడి... ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు.

పగలు, ప్రతికారాలతో కొందరు మనుషులు మృగాళ్లా మారిపోతున్నారు. ప్రతి చిన్న విషయాన్నికి ఎదుటి వ్యక్తిపై కక్ష పెంచుకునే మూర్ఖుల సంఖ్య రోజు రోజుకు పెరిగుతుంది. తాజాగా పార్కింగ్ విషయంలో గొడవ పడి... ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు.

వీడియో: పార్కింగ్ విషయంలో గొడవ..హోటల్ యజమాని దారుణ హత్య

నేటికాలంలో మనిషుల్లో సహనం, ఓర్పు అనేది కొరవడుతుంది. అందుకే ప్రతి చిన్న విషయానికి ఎదుటి వ్యక్తిపై కక్షలు పెంచుకుంటున్నారు.  అంతేకాక సహనం కోల్పోయి.. దారుణంగా హత్యలకు తెగపడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. పార్కింగ్ విషయంలో నెలకొన్న గొడవ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఈ దారుణ హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ యూసుఫ్‌గూడకు చెందిన చెల్లూరి శ్రీనివాస్‌ (54) కొండాపూర్‌ వైట్‌ ఫీల్డ్స్‌ విల్లాస్‌లో నివాసం ఉంటున్నారు. గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో తన కుమారుడు కేశవ్‌ వినయ్‌(28)తో కలిసి సీఎస్‌ డెలాయిట్‌ ఇన్‌ అనే హోటల్‌  నిర్వహిస్తున్నాడు. ఇక శ్రీనివాస్ హోటల్‌ వెనుక స్టోర్‌ రూం కోసం ఓ రూమ్ ను అద్దెకు తీసుకున్నారు. ఇక ఏడాది క్రితం వీరు తీసుకున్న స్టోర్ రూం కి ఎదుట రోడ్డుపై ఆటో ట్రాలీ పార్క్ చేస్తున్నారు. అలా వాటిని పాక్ర్ చేసి సరకులు దించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ట్రాలీ పార్కింగ్ కారణంగా దారిలో రాకపోకలకు ఇబ్బంది కులుగుతుందని పక్కింట్లో ఉండే మహేందర్ అనే వ్యక్తి హోటల్ యాజమాని అయినా శ్రీనివాస్ తో గొడవపడ్డాడు.

ఈ ఘటన జరిగి దాదాపు ఏడాది దాటింది. ఇలానే ఆ సమయంలో మహేందర్ ఎంబీఏ పూర్తి చేసి ఏ పని లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. దీంతో ఏడాది క్రితం పార్కింగ్ విషయంలో మహేందర్ హోటల్ యజమానితో గొడవ పడ్డాడు. ఇదే సమయంలో  స్థానికులు సర్థి చెప్పారు. అలానే వారందరూ శ్రీనివాస్ కే మద్దతు తెలిపి మహేందర్ ను సముదాయించి పంపించారు. ఇక అందరు తనదే తప్పు అని చెప్పడంతే మహేందర్ అవమానంగా భావించాడు. అందరిలో తన పరువు తీశాడని అప్పటి నుంచి శ్రీనివాస్ పై  మహేందర్ కక్ష కట్టాడు. ఎలాగైనా శ్రీనివాస్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ఇనుప రాడ్డుతో హోటల్ లోకి ప్రవేశించి.. సోఫాలో కూర్చొని ఉన్న శ్రీనివాస్ పై అకస్మాత్తుగా రాడ్డుతో దాడి చేశాడు. అక్కడే ఉన్న కుమారుడు వినయ్ మహేందర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. మహేందర్ చేతులోని రాడ్డును పట్టుకుని దూరం నెట్టే ప్రయత్నం చేశాడు. ఈ హత్య ఘటనకు  సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను వెంటనే కేర్‌ ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలైన ఆయన ఐదు గంటలపాటు మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్న విషయంలో ఎదుటి కక్షలు పెంచుకుని ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఒక వ్యక్తి ప్రాణం తీయడంతో పాటు వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.