P Krishna
Congress CLP Meeting: తెలంగాణలో నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం అవుతుంది.
Congress CLP Meeting: తెలంగాణలో నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం అవుతుంది.
P Krishna
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పోటీ పడగా భారీ మెజార్టీతో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతుంది. అయితే సీఎం గా ఎవరిని నియమించాలి అనేదానిపై భారీగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీనీ తన భుజాల పై వేసుకున్న పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సీఎంగా ఎన్నుకుంటారా లేదా దళిత నాయకుడు భట్టి విక్రమార్క కు పట్టం కడతారా అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కొద్ది సేపట్లో సీఎల్పీ సమావేశంలో ఎవరు సీఎం అనే దానిపై స్పష్టత రాబోతుంది. నవంబర్ 30 న 119 స్థానాలకు పోలింగ్ జరగగా.. డిసెంబర్ 3 న ఫలితాలు వెలువడ్డాయి. వివరాల్లెకి వెళితే..
తెలంగాణ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి 64 సీట్లు గెల్చుకొని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలోనే గెలిచిన ఎమ్మెల్యేలతో నేడు గచ్చిబౌలిలోని హుటల్ ఎల్లాలో కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ పార్టీ సీఎల్పీ నేతను ఎన్నుకుంటారు. కొద్దిసేపట్లో సీఎల్పీ సమాశం జరగబోతుంది.. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హూటల్ కి చేరుకున్నారు. ఈ భేటీలో పార్టీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయం సేకరించి ఏకవ్యాక్య తీర్మాణం చేయనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు సీఎం ఎవరు అనేది ప్రకటించబోతున్నారు. కాగా, సీఎల్పీ మీటింగ్ పై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినా.. భట్టి విక్రమార్కా అనేది తెలియాల్సి ఉంది.