P Venkatesh
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసే విద్యార్థులకు అలర్ట్. ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇలా చెక్ చేసుకోండి.
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూసే విద్యార్థులకు అలర్ట్. ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇలా చెక్ చేసుకోండి.
P Venkatesh
తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ రోజు 2 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ సెక్రటరీ వెంకటేశం. ఇంటర్ ఫస్టియర్ లో 63.86 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండ్ ఇయర్ లో 43.77 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 3 వరకు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో పరీక్ష ఫెయిల్ అయిన వారితోపాటు ఫస్టియర్‌లో ఇంప్రూవ్‌మెంట్ కోసం ఈ పరీక్షకు హాజరైన వారు ఉన్నారు.