iDreamPost
android-app
ios-app

అమెరికాలో తెలుగు వారికి రక్షణ కరువు! మరో యువకుడు కిడ్నాప్!

అమెరికా వెళ్లాలంటే భయపడిపోతున్న రోజులు వస్తున్నాయి. భారతీయులకు అగ్ర రాజ్యంలో రక్షణ కరువైంది. ఇటీవల కాలంలో పలువురు తెలుగు యువకులు మృతి చెందిన సంగతి విదితమే.. తాజాగా

అమెరికా వెళ్లాలంటే భయపడిపోతున్న రోజులు వస్తున్నాయి. భారతీయులకు అగ్ర రాజ్యంలో రక్షణ కరువైంది. ఇటీవల కాలంలో పలువురు తెలుగు యువకులు మృతి చెందిన సంగతి విదితమే.. తాజాగా

అమెరికాలో తెలుగు వారికి రక్షణ కరువు! మరో యువకుడు కిడ్నాప్!

ఒకప్పుడు అమెరికా అంటే విపరీతమైన క్రేజ్. స్టడీస్, ఎంజాయ్ మెంట్, ఉద్యోగం ఏదైనా అబ్రాడ్ అనగానే.. ముందుకు గుర్తుకు వచ్చేది ఈ అగ్ర రాజ్యమే. కానీ ఇప్పుడు అమెరికా అంటే అయ్య బాబోయ్ అంటున్నారు ఇండియన్స్. ఎందుకంటే.. అక్కడ వరుసగా భారతీయులపై దాడులు జరుగుతున్నాయి. ఈ మూడు నెలల కాలంలో అనేక దాడులు చోటుచేసుకున్నాయి. గత కొన్ని వారాల్లో ఐదారుగురు మరణించారు. ఇందులో తెలుగు వ్యక్తులు ఉండటం విషాదకరం. ఇక దాడుల సంగతి చెప్పనక్కర్లేదు. లెక్కలేనన్నీ జరుగుతున్నాయి. జాతి వివక్షత లేక సైకోయిజమా తెలియదు కానీ ఇండియన్స్‌ను టార్గెట్ చేశారు కొంత మంది అమెరికన్ పీపుల్స్.

కొన్ని రోజుల క్రితం భరత నాట్య, కూచిపూడి కళాకారుడు అమర్ నాథ్ ఘోష్ ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపిన సంగతి విదితమే. మొన్న రోడ్డు ప్రమాదంలో తెలుగు యువకుడు మరణించాడు. అది మర్చిపోక ముందు మరో తెలుగు కుర్రాడు గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన పరుచూరి అభిజిత్ ను బోస్టన్ యూనివర్శిటీలో కాల్చి చంపారు ఆగంతకులు. ఇప్పుడు మరో తెలుగు విద్యార్థి అదృశ్యమయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ సలీం కుమారుడు అబ్దుల్ మహమ్మద్ అనే 25 ఏళ్ల కుర్రాడు.. గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. అక్కడ క్లేవ్ ల్యాండ్ యూనివర్శిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో మాస్టర్స్ చేస్తున్న అబ్దుల్ జాడ మార్చి 7 నుండి తెలియట్లేదు. దీంతో మరుసటి రోజు అమెరికాలోని అబ్దుల్ బంధువులు క్లేవ్ ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అబ్దుల్ కోసం అతడి కుటుంబ సభ్యులు మార్చి 18న చికాగోలోని భారత కాన్సులేట్‌ను కూడా ఆశ్రయించారు. ఇంతలో అబ్దుల్‌ను కిడ్నాప్ చేశామంటూ అతడి తండ్రి సలీంకు ఫోన్ వచ్చింది. అతడ్ని విడిచి పెట్టాలంటే.. 1200 డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆగంతకులు. లేకుంటే.. అతడి కిడ్నీలు అమ్మేస్తామంటూ బెదిరించారు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, అతడి ఆచూకీ గురించి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తు కోసం పిల్లల్ని విదేశాలకు పంపిస్తే.. దుండగుల చేతిలో బలౌతున్నారు భారతీయులు.